గుడ్​ న్యూస్: కాలం చెల్లిన కార్లను స్క్రాప్​చేస్తే 75 శాతం టాక్స్​డిస్కౌంట్​

యూపీ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు కాలం చెల్లించిన వాహనాలను(end-of-lifevehicles​) రద్దు చేసేందుకు టాక్స్​మినహాయింపులను ప్రకటించింది. కొత్త విధానం ద్వారా యూపీతో పాటు ఎన్​ సీఆర్​ ప్రాంతంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు పాత వాహనాలను స్క్రాప్​ చేస్తే 75 శాతం వరకు టాక్స్​ మినహింపును  అందిస్తోంది. ఈ ఆఫర్​ సెప్టెంబర్ 11,2024 నుంచి మార్చి 10, 2025 వరకు అమలులో ఉంటుంది. ఈ పాలసీలో పాత వాహనాలపై చెల్లించని బకాయిలు ఏమైనా ఉంటే అన్నీ మాఫీ చేస్తుంది. రిజిస్ట్రేషన్​ పన్ను మినహాయింపుతో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. 

యూపీ వెహికల్ టాక్స్​మినహాయింపు

యూపీలో కాలం చెల్లిన వెహికల్ స్క్రాప్​ కోసం టాక్స్​ మినహాయింపు రూల్స్​ లో భాగంగా 2003 కంటే ముందు రిజిస్టర్ చేయబడిన వెహికల్స్​ రద్దు చేయబడితే వాటిపై 75 శాతం పన్ను మినహాయిం పు ఉంటుంది. 2023 నుంచి 2008 మధ్య కాలంలో నమోదు అయిన వాహనాలకు 50 శాతం పన్ను తగ్గింపు ఉంటుంది. దీంతోపాటు 2008నుంచి 2013 మధ్య శ్రీన్​ సీౠర్​ జిల్లాల్లో నమోదు అయిన డీజిల్​ వెహికల్స్ పై కూడా 50 శాతం టాక్స్​ మినహాయింపు ఉంటుంది. 

ఈ పన్ను మినహాయింపు సెప్టెంబరు 11, 2024 నుండి మార్చి 10, 2025 వరకు పరిమిత సమయం వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆరు నెలల పాటు రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ సెంటర్‌లో తమ వెహికల్స్​ను స్క్రాప్ చేయడాన్ని చేస్తే యజమానులకు ఎలాంటి జరిమానాలు ఉండవు.  చెల్లించని బకాయిలు మాఫీ, ఎలక్ట్రిక్​ వెహికల్స్​ కొనుగోలుకు అదనపు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించనున్నారు.