భారత్ లోక్‌సభ ఎన్నికల్లో ఇజ్రాయిల్ జోక్యం: AI

భారత్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఇజ్రాయిల్ జోక్యం చేసుకుందని ఏఐ తెలిపింది. ఏఐను ఉపయోగించి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెలీ సంస్థ స్టయిక్‌ ప్రయత్నించిందని ఓపెన్‌ఏఐ ఒక నివేదికలో వెల్లడించింది. ఈ సంస్థ అధికార బీజేపీని విమర్శిస్తూ, కాంగ్రెస్‌ను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు, కంటెంట్‌ ఉత్పత్తి చేసి సోషల్‌ మీడియాతో పాటు పలు వెబ్‌సైట్‌లలో ఇజ్రాయెల్‌ నుంచే వినియోగించినట్టు పేర్కొన్నది.

ఈ సంస్థ రహస్య కార్యకలాపాలను అడ్డుకున్నట్టు తెలిపింది. ఓపెన్‌ఏఐ నివేదికపై కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. దేశంలో, బయట ఈ పని ఎవరు చేశారో విచారణ జరిపి బయటపెట్టాలని ఆయన పేర్కొన్నారు. ఇది దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.