Anand Mahindra: AI ఐదేళ్లకు ముందే క్యాన్సర్ ను గుర్తిస్తుంది.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్

రొమ్ము క్యాన్సర్ మహిళల్లో ఇప్పుడు ప్రధాన ఆరోగ్య సమస్య.. రొమ్ము క్యాన్సర్ కేసుల్లో ఎనిమింది కేసుల్లో ఒకటి ఇన్వాసివ్ గా మారుతుంది. 39 మంది మహిళల్లో ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారు. మనిషి ప్రాణాలను రక్షించడంలో వైద్య శాస్త్రం చాలా అభివృద్ధి చెందినప్పటికీ రొమ్ము క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించడం చాలా అవసరం అంటున్నారు డాక్టర్లు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా రొమ్ము క్యాన్సర్ పై ఆసక్తికర పోస్ట్ X ఫ్లాట్ ఫాం లో షేర్ చేశారు. ఐదేళ్లకు ముందే రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడంలో సహాయపడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తించి ఆయన పోస్ట్ ను షేర్ చేసి హైలైట్ చేశారు. 

AsymMirai అని పిలువబడే కొత్త AI వ్యవస్థపై అధ్యయనం రేడియాలజీ అనే సైంటిఫిక్ జర్నల్ లో ప్రచురించబడింది. ఎడమ, కుడి రొమ్ములలో తులనాత్మక( అంటే పోల్చినప్పుడు) మార్పులను గమనించడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ను AI సులభంగా గుర్తిస్తుందన్నారు. డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు చెప్పారు. 

ఇప్పుడు ఉపయోగిస్తున్న రిస్క్ కాలిక్యులేటర్ టైరర్ కుజిక్ కంటే AsymMirai భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ ను రెండింతలు గుర్తించకలుగుతుందంటున్నారు పరిశోధకులు.  డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకుడు డోనెల్లి AsymMirai గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒక మహిళ ఎడమ , కుడి రొమ్ము కణజాలం హధ్య వ్యత్యాసాల ఆధారంగా వచ్చే ఐదేళ్లలో క్యాన్సర్ ను అభివృద్ధి చేస్తుందో లేదో ఖచ్చితంగా అంచనా వేయగలిగామని డోనెల్లి తన నివేదికలో వెల్లడించారు. 

ఎప్పుడూ..ఒక సందేశంతో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు ఆనంద్ మహీంద్రా.. ఆయన ఈ పోస్ట్ ను అలా షేర్ చేశారో లేదో.. నిమిషాల్లో వేలల్లో లైకులు, వ్యూస్ వచ్చాయి.ఈ పోస్టుపై ప్రముఖ డాక్టర్లతో సహా చాలామంది నెటిజన్లు రిప్లయ్ ఇచ్చారు. 

ఓ డాక్టర్లు స్పందిస్తూ.. ఇది చాలా ఖచ్చితమైనది..మేము కూడా హృదయ స్పందనల నుండి కార్డియాక్ అరిథ్మియాను గుర్తించడానికి , రోగి దగ్గు నుంచి కోవిడ్‌ని గుర్తించడానికి కూడా AIని అన్వేషిస్తున్నాం.. AI మేము రోగులకు చికిత్స చేసేత విధానంతోపాటు ఎంతో హెల్ప్ ఫుల్ గా ఉంటుందని రాశారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ప్రాణాలను కాపాడే విషయం..మంచి మేసేజ్ అంటూ రాశారు.