మందు బాబులకు సవాల్.. బ్రాండ్ ఏదో చెప్పడంలో మనుషులను మించిపోయిన ఏఐ

మీకు మందు తాగే అలవాటు ఉందా.. రెగ్యులర్ గా మందు తాగేవారే అయితే.. బ్రాండ్ చూడకుండా టేస్ట్ చూసి అది ఏ బ్రాండో చెప్పగలరా..? మనం చెప్పగలమో లేదో కానీ.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI)  ఆ పని చేస్తుంది. అవును మీరు విన్నది నిజం. ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ విషయంలోనే అడ్వా్న్స్ గా ఆలోచిస్తుందని ప్రపంచం అంతా నమ్ముతోంది. కానీ లేటెస్ట్ గా మరో రికార్డు సృష్టించింది కృత్రిమ మేధ (Artificial Intelligence).  

ఇటీవల కృత్రిమ మేధను ఉపయోగించి విష్కీ ఎక్కడ తయారు చేశారు.. అందులో ఏమేం ఇంగ్రిడియెంట్స్ ఉన్నాయో తెలుసుకున్నారు. యూఎస్, స్కాట్ లాండ్ లో తయారు చేసిన విష్కీ సాంపుల్స్ ను ఏఐతో టెస్ట్ చేయించగా అది ఎక్కడ తయారయ్యిందో చెప్పేసిందట. అంటే ఆ విష్కీలలో వాడే ముడిపదార్థాల ఆధారంగా అది రిలీజ్ చేసే స్మెల్, టేస్ట్ తదితర అంశాల ఆధారంగా ఏఐ అది ఎక్కడ తయారయిందో చెప్పేసిందట. రెగ్యులర్ గా తాగే మనమే ఏ బ్రాండ్ ఎక్కడ చేశారో చెప్పలేం.. ఏఐ మాత్రం ఇట్టే పసిగట్టేస్తోంది. 

అదే విధంగా విష్కీ తయారీలో ఏ పదార్థాలను ఎంత మోతాదులో కలపాలో ఎక్స్ పర్ట్స్ కంటే బాగా చెప్పేస్తోందట. అందులో కలిసి ఉన్న అణువుల కలయికను బట్టి ఏది ఎక్కువైందీ, ఏది తక్కువైందీ అన్నీ చెప్పేసిందట. సేమ్ బ్రాండ్ కు సంబంధించీ వివిధ ఫ్లేవర్స్ తో కూడాని విష్కీలను తయారు చేసేందుకు చాలా ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. 

ALSO READ | Oppo Reno 13 సిరీస్ స్మార్ట్ఫోన్ల డిజైన్ రివీల్..కెమెరా సిస్టమ్ అదుర్స్..

స్మెల్, ఫ్లేవర్ చూసి అందులో ఎంత మోతాదులో ఏమేం ఉన్నాయి.. ఇంకా యాడ్ చేయాల్సినవి ఏంటని చెప్పడం అంత తేలిక కాదు. అందులో వినియోగించే వివిధ పదార్థాలు కలిసిపోయిన తర్వాత డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంటాయి. అదే విధంగా కొన్ని కెమికల్స్ కలయిక వలన వాసన సరిగ్గా గుర్తు పట్టడానికి మనిషి నాసికా రంధ్రాలు కూడా అంత ఎక్జాట్ గా పనిచేయవు. అలాంటిది.. ఒక మెషీన్ లేదా టెక్నాలజీపై పనిచేసే ఏఐ దీనిని గుర్తించడం మామూలు విషయం కాదని చెబుతున్నారు. 

ఇటీవల అమెరికా, స్కాట్ లాండ్ కు చెందిన 16 రకాల విష్కాలకు సంబంధించిన ఫ్లేవర్స్ ను ఏఐకి చూపించి ట్రైన్ చేయించారట. జాక్ డేనియల్స్, మేకర్స్ మార్క్ లాంటి టాప్ బ్రాండ్స్ కు సంబంధించిన ఫార్ములా గురించి ట్రైన్ చేశారంట. అయితే ఇందులో కొన్ని ఆల్గారిథమ్స్ కు సంబంధించి 90 శాతం అక్యురేట్ గా ఫార్ములా మిక్సింగ్ చేసిందట. అలాగే ఇంకా బెటర్ ప్రొడక్టివిటీ కోసం బెస్ట్ కాంపోజిషన్ ను సజ్జెస్ట్ చేసిందని పరిశోధకులు చెబుతున్నారు.