AI Affect: 2030 నాటికి  కోటి 20 లక్షల ఉద్యోగాలు పోతాయి: మేకిన్స్ రిపోర్ట్ 

ఐటీ రంగంలో లేఆఫ్స్ గత మూడేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. కంపెనీలు నిర్వహణ, ఆర్థిక మాంద్యం, కొత్త టెక్నాలజీ.. ఇలా కారణాలు ఏమైనా..టెకీల్లో  లేఆఫ్స్ భయం వెంటాడుతూనే ఉంది. ఇటీవల కంపెనీలు వరుసగా ఉద్యోగుల  తొలగింపులు చేపడుతుండటం, దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో రాను న్న రోజుల్లో భారీగాఉద్యోగాలు  ఉద్యోగాల తొలగింపులు  జరుగుతాయని కొన్ని సర్వేలు కూడా చెపుతుండటంతో టెకీల భవిష్యత్ పై ఆందోళనలు వ్యక్తం అవుతున్నా యి.  

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాబోయే దశాబ్దంలో జాబ్ మార్కెట్ లో గణనీయమైన ప్రభావం చూపనుంది. ఇటీవల మేకిన్స్ అనే సంస్థ నివేదిక ప్రకారం.. 2030 నా టికి దాదాపు 12 మిలియన్లు అంటే కోటి 20 లక్షల ఉద్యోగాలు పోతాయట. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయట. 30 శాతం పనులు AI టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా ఉంటాయి.

ముఖ్యంగా హెల్త్ కేర్, STEM( సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ) రంగాల్లో ఈ అభివృద్ది జరుగుతుందట. అడ్మినిస్ట్రేషన్ హెల్ప్, కస్టమర్ సర్వీస్, సేల్స్, ఫుడ్ సర్వీస్, ప్రాడక్ట్, మ్యాన్యుఫాక్చరింగ్ లో రంగాల్లో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నివేదికలు చెపుతున్నాయి.