టెలిగ్రాం యూజర్ల కొంప మునిగింది.. మనకు తెలియకుండా ఇంత జరుగుతోందా..?

ఇన్స్టాంట్ మెసేజింగ్ సర్వీస్ అయిన టెలిగ్రామ్ యూజర్ల కొంప మునిగింది. టెలిగ్రాంలో ఏఐ పవర్డ్ చాట్బాట్స్ను వాడి అశ్లీల ఫొటోలు క్రియేట్ చేస్తున్నట్లు తేలింది. టెలిగ్రాంలో దాదాపు 4 మిలియన్ల మంది ఈ పాడు పనులు చేస్తు్న్నట్లు అమెరికన్ వెబ్సైట్ Wired రిపోర్ట్ చేసింది. అంతేకాదు.. డీప్ఫేక్స్ క్రియేట్ చేసేందుకు టెలిగ్రాంను అడ్డాగా మార్చుకున్నట్లు తెలిసింది. టెలిగ్రాం యూజర్లుగా ఉన్న అమ్మాయిల ఫొటోలు, మహిళల ఫొటోలను వాడుకుని ఆ ఫొటోలను డీప్ ఫేక్ సాయంతో దుస్తులు లేకుండా చిత్రీకరించడం, శృంగార వీడియోల్లో ఆ ఫొటోలను వాడటం చేస్తున్నారని వైర్డ్ బయటపెట్టింది. 

డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల ఎంత మంచి ఉందో, అంతే చెడు కూడా ఉందని మరోసారి ఈ పరిణామం రుజువు చేసింది. ఈ టెక్నాలజీ సాయంతో చనిపోయిన నటులను లేదా వ్యక్తులను ఉనికిలోకి తేవచ్చు. ప్రాణం పోయలేం గానీ ఈ టెక్నాలజీ సాయంతో చనిపోయిన వ్యక్తి ఫొటోను ఉపయోగించి ఆ వ్యక్తితో మాట్లాడించవచ్చు. హావభావాలను పలికించవచ్చు. అయితే.. ఈ టెక్నాలజీని కొందరు నీచమైన పనులకు వినియోగిస్తుండటం శోచనీయం. 

ALSO READ | మార్కెట్లోకి మారుతీ సుజుకి షిఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌ రూ.50వేల విలువగల యాక్సెసరీస్ ఫ్రీ

డీప్ ఫేక్ సాయంతో సినీ నటి రష్మిక ఫొటోను వాడి ఆమె మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ పరిణామం ఆమెను మానసికంగా కుంగదీసింది. ఇలా ఎంతో మంది అమ్మాయిలు, మహిళల ఫొటోలను వాడుకుంటూ టెలిగ్రామ్లో న్యూడ్ ఫొటోలను, వీడియోలను క్రియేట్ చేస్తున్నట్లు స్పష్టమైంది. టెలిగ్రామ్ దుర్వినియోగం పెరిగిపోవడంతో సదరు మెసేజింగ్ సర్వీస్పై ఇటీవల పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.

భారత ప్రభుత్వం టెలిగ్రామ్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిందని, ఇండియాలో టెలిగ్రాంపై నిషేధం విధించాలని డిసైడ్ అయిందని వార్తలు కూడా వచ్చాయి. భారత్లో దాదాపు 104 మిలియన్ల మంది టెలిగ్రాం యూజర్లు ఉన్నారు. టెలిగ్రాంను ఇతర దేశాల్లో కంటే ఎక్కువగా వినియోగిస్తుంది ఇండియాలోనే కావడం గమనార్హం. టెలిగ్రాం యూజర్లలో 20 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు.