బీసీ గురుకులాల్లో అగ్రికల్చర్​ బీఎస్సీ

మహాత్మా జ్యోతిబాఫులె బ్యాక్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌ క్లాసెస్‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహించే వనపర్తి, కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని మహాత్మా జ్యోతిబాఫులె బ్యాక్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌ క్లాసెస్‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ కాలేజీల్లో 2024-–25 విద్యా సంవత్సరానికి ఫస్ట్​ ఇయర్​ బీఎస్సీ(ఆనర్స్‌‌‌‌‌‌‌‌) అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ కోర్సులో అడ్మిషన్స్​కు నోటిఫికేషన్ విడుదలైంది. 

కోర్సు–సీట్లు: వ్యవసాయ కళాశాల (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌‌‌‌‌‌‌‌ఈఐఎస్‌‌‌‌‌‌‌‌), వనపర్తి: 120 సీట్లు, వ్యవసాయ కళాశాల (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌‌‌‌‌‌‌‌ఈఐఎస్‌‌‌‌‌‌‌‌), కరీంనగర్: 120 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

అర్హతలు: ఇంటర్మీడియట్ (బైపీసీ) ఉత్తీర్ణులైన బాలికలు అర్హులు. టీజీ ఈఏపీసెట్‌‌‌‌‌‌‌‌ 2024 ర్యాంకు సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు. వయసు 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

సెలెక్షన్​ ప్రాసెస్​: టీజీ ఈఏపీసెట్‌‌‌‌‌‌‌‌ 2024 ర్యాంకు, రూల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. అభ్యర్థులు ఆన్​లైన్​లో ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ.1000 చెల్లించాలి. పూర్తి వివరాలకు www.mjptbcwreis.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.