ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలి : వెంకటరమణారెడ్డి

  •     క్షేత్ర స్థాయికి వెళ్లి పంట నష్టం వివరాలు సేకరించాలి
  •     కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు :  అగ్రికల్చర్​అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆదేశించారు. నష్టపోయిన ప్రతీరైతుకు పరిహారం చెల్లించాలన్నారు. క్యాంప్​ ఆఫీస్​లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులెవరూ క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించడం లేదన్నారు. ప్రకృతి వైఫరీత్యాల సహాయ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్​అడ్డురాదన్నారు. కామారెడ్డి నియోజక వర్గంలో 7 వేల మందికి పైగా రైతులు నష్టపోయారన్నారు.

ఏ ఒక్క రైతును విస్మరించినా ఊరుకోమన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గతేడాది వడగండ్ల వానకు నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10వేల సాయం ప్రకటించినా రైతులకు చెల్లించలేదన్నారు. ఈ సారి అలాగే చేస్తే రైతులతో కలిసి ఉద్యమం చేపడతామన్నారు. పంట పొలాల్లో  పడిపోయిన కరెంట్​స్తంభాలకు ఎలాంటి పైసలు వసూలు చేయకుండా ఎలక్ట్రిసిటీ యంత్రాంగం త్వరితగతిన పనులు చేపట్టాలన్నారు. 

ఎంట్రెన్స్​ టెస్ట్​ పోస్టర్ల రిలీజ్​

కామారెడ్డి సరస్వతి విద్యా మందిర్ ​హైస్కూల్​లో 5వ నుంచి 10వ తరగతి ఫ్రీ ఎడ్యుకేషన్​కు సంబంధించిన ఎంట్రెన్స్​ టెస్ట్​ పోస్టర్​ను ఎమ్మెల్యే రిలీజ్​ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 31న టెస్ట్​ నిర్వహిస్తున్నట్లు స్కూల్ ​యాజమాన్య సభ్యులు తెలిపారు. స్కూల్​ కమిటీ ప్రతినిధులు  బొడ్డు శంకర్, అశోక్​రావు, ప్రతాప్​గౌడ్, లాల్​ వరిందాని, ఎస్ఎన్​చారి, నాగభూషణం, నగేశ్​పాల్గొన్నారు.