రైతులకు ఇది లాభదాయకం... పాత సైకిల్ తో కలుపుమొక్కలు తీయొచ్చు..

పట్టణాల్లో.. ఓ పక్క ఇంటి అద్దెలు.. మరో పక్క చాలీ చాలని జీతాలతో యువత సతమతమవుతుంది.  ఈ క్రమంలో కొంతమంది సొంతూళ్లకు వెళ్లి కూలో.. నాలో చేసుకొని బతుకుదామని యూత్​ ఆలోచిస్తున్నారు.  కాని ఒకరిద్దరు ధైర్యం చేసినా.. చాలా మంది ధైర్యం చేయలేకపోతున్నారు.  అలాంటి వారు  మారుతున్న ప్రపంచానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటే.. సొంతూరులోనే మహారాజుగా బతికేయవచ్చు.. అదెలా సాధ్యమనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.   

 ఎంతో మంది చేసే ఉద్యోగాలను వదిలేసి పల్లెబాట పట్టారు. వారసత్వంగా వస్తున్న భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటారు. ఒక వేళ భూమి లేకపోతే కవులకు ( లీజుకు) తీసుకొని సాగు చేయండి.   మారుతున్న ప్రపంచానికి సాంకేతిక పరిజ్ఞానం అందించాలని  కొంతమంది యువకులు భావించారు. అన్నింటికంటే కూలీలకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని ఆలోచనలో పడ్డాడు. ప్రతిభ అనేది ఎవరి సొంతం కాదు. ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు శాస్త్రవేత్తలకే పరిమితం కాదు రైతులు కూడా వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూలీల సంఖ్యను తగ్గించడానికి ఓ రైతు వినూత్న ప్రయోగం చేశాడు.పాత సైకిల్ తో కలుపు తీసే పరికరాన్ని రూపొందించాడు. పొలంలో పాత సైకిల్ తో కలుపు తీస్తూ తోటి రైతులను ఆకర్షిస్తున్నాడు.

వ్యవసాయంలో విత్తనాలు వేయడానికి , పురుగు మందులు  పిచికారీ చేయడానికి కూలీలు దొరక్క రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కూలీల కొరత తో పాటు ఎద్దులతో గుంటక కొట్టించడానికి ఖర్చు ఎక్కువవుతుంది. గుంటుకకు ప్రతిరోజు 800 రూపాయల కిరాయి అవుతుందని రైతులు అంటున్నారు. దీంతో పత్తి చేలో ఈజీగా కలుపు తీసేందుకు సరికొత్త ఆలోచన చేశాడు. పాత సైకిల్ తో ఓ ప్రయోగం చేశాడు.

కృషి ఉంటే మనుషులు బుషులు అవుతారు అనేది ఇక్కడ వర్తిస్తుంది. మనం తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. దాని నిరూపించాడు ఈరైతు. పాత సైకిల్ కు వ్యవసాయ పరికరాలను అమర్చి కలుపు తీయడం, గుంటుక కొట్టడం ప్రారంభించాడు. దీంతో కూలీల కొరతను అధిగమించడం తో పాటు తక్కువ శ్రమతో ఎక్కువ పనిని చేసేందుకు ఈ సైకిల్ గుంటుక కూడా ఉపయోగపడుతుంది. దీనిని తయారు చేయడానికి వెయ్యి రూపాయలు ఖర్చు అయిందని, ఒక ఎకరంలో ముగ్గురు కూలీలు చేసే పనిని ఈ సైకిల్ గుంటుకతో ఒక్కరు చేస్తున్నానని చెబుతున్నాడు. 

ఈవినూత్న పరికరంతో కలుపు తీయడం, గుంటుక కొట్టడంతో ఎకరాకు 20 వేల రూపాయల వరకు ఆదా అవుతుందని రైతులు చెబుతున్నారు. పొలంలో ఈజీగా కలుపు తీస్తున్నామని గుంటుక కొట్టడానికి ఇది అనుకూలంగా ఉందని చాలామంది రైతులు చెబుతున్నారు. వ్యవసాయ పనుల్లో ఉపయోగపడుతున్న ఈసైకిల్ తో కూలీల కొరతను తగ్గించుకొని సమయాన్ని ఆదా చేసుకుంటున్నామని రైతులు అంటున్నారు.