అది ఉత్తరప్రదేశ్ లోని బందా రైల్వే జంక్షన్..సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ కోసం ఎదురు చూస్తున్నాడు ఓ ప్రయాణికుడు.. ట్రైన్ రానే వచ్చింది.. బోగిలోకి ఎక్కేందుకు అతడు పరుగెత్తాడు..కానీతనకు కేటాయించిన ఏసీ కోచ్ కనిపించలేదు.. నిమిషం పాటు కంగారు పడ్డాడు..ఎలాగైన ట్రైన్ క్యాచ్ చేయాలని మరో బోగీలోకి ఎక్కాడు.. దీంతో కోచ్ ఏర్పాటు చేయని రైల్వే డిపార్ట్ మెంట్ పై ప్రయాణికుడి కోపం వచ్చింది. తనకు జరిగిన అసౌకర్యానికి రైల్వే డిపార్ట్ మెంట్ పై కోర్టుకు వెళ్లాడు.
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన 63 ఏళ్ల వ్యక్తి రైల్వే శాఖ నుంచి రూ.440 చెల్లించాలని ఐదేళ్లకు పైగా పోరాటం చేసి 45 విచారణలకు హాజరయ్యాడు. ఆగ్రా డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరమ్ కోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అతను చివరకు యుద్ధంలో గెలిచాడు. వార్షిక వడ్డీకి 7తో పాటు మొత్తాన్ని అందజేయాలని రైల్వేని ఆదేశించింది కోర్టు.45 రోజులకు మించి చెల్లింపు ఆలస్యమైతే వడ్డీ 9 శాతానికి పెరుగుతుందని కోర్టు పేర్కొంది. ఫిర్యాదుదారునికి న్యాయపరమైన రుసుముతో పాటు ఆర్థిక , మానసిక క్షోభ కలిగించినందుకు అదనంగా రూ. 8వేలు చెల్లించాలని రైల్వే అధికారులను కోరింది.
2017 ఉత్తర ప్రదేశ్ కు చెందిన మున్నాలాల్ అగర్వాల్.. ఆగ్రా కాంట్ స్టేషన్ కు వెళ్లేందుకు బందా రైల్వే జంక్షన్ లో సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ కోసం తాత్కాల్ కోటా కింద 2వ ఏసీ కోచ్ ను టికెట్ ధర 1,570 పెట్టి బుక్ చేసుకోవడంతో కథ మొదలైంది. ప్లాట్ ఫామ్ ఫై కి వచ్చి సంపర్క్ ఎక్స్ ప్రెస్ లో 2వ ఏసీ కోచ్ ను జత చేయలేదు. దీంతో మున్నాలాల్ మరో కోచ్ లోకి ఎక్కాడు. రైలు కదిలిన తర్వాత టీసీని అడిగితే 3వ ఏసీ కోచ్ లో సీటు ను కేటాయించాడు.. అయితే మూడో కోచ్ కూడా ఆ సీటు అప్పటికే మరొకరికి కేటాయించబడింది.. పైగా ఈ కోచ్ లో టిక్కెట్ ధర 440 రూపాయలు తక్కువ. దీంతో మున్నాలాల్ కు కోపం వచ్చింది.
మున్నాలాల్ తనకు 3వ కోచ్ లో ఎదురైన అసౌకర్యానికి ఆనారోగ్యానికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకు కేటాయించి కోచ్ ను అటాచ్ చేయకపోవడం.. మరో కోచ్ లో కేటాయించిన సీటు దగ్గర ఇబ్బంది ఎదుర్కొవడం.. తనకు 440 రూపాయల నష్ట జరగడంపై మున్నాలాల్ అసహన వ్యక్తం చేస్తూ రైల్వే శాఖకు లేఖలు, మెయిల్స్ పంపించాడు. అయినా ఎటువంటి స్పందన లేదు.. దీంతో ఉత్తర మధ్య రైల్వేకు లీగల్ నోటీసులు పంపించాడు మున్నాలాల్..
అయినా రైల్వే శాఖ స్పందించకపోవడంతో.. 2018లో అగ్రా వినియోగదారుల ఫోరం కోర్టుకు వెళ్లారు మున్నాలాల్.. రైల్వే శాఖ ఈ కేసును తప్పించుకునేందుకు ప్రయత్నించింది. మున్నాలాల్ అతని బృందం పట్టు వదలకుండా సుప్రీంకోర్టు పూర్వాపరాలను వివరించారు.
చివరికి మున్నాలాల్ గెలిచాడు..45 విచారణల తర్వాత.. కోర్టు మున్నాలాల్ కు అనుకూలంగా తీర్పు చెప్పింది. కోర్టు ద్వారా రైల్వే శాఖనుంచి తనకు రావాల్సిన 440 రూపాయలతోపాటు అదనంగా 8వేల రూపాయల పరిహారం పొందాడు మున్నాలాల్.
Also Read :- మంటల్లో హైదరాబాద్ లోని అపార్ట్ మెంట్.. పలువురు సజీవదహనం