టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ భీకర ఫామ్.. భారత క్రికెటర్లు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లిలకు తలనొప్పిగా మారింది. శుక్రవారం(నవంబర్ 15) సఫారీలతో జరిగిన ఆఖరి టీ20లో సెంచరీ చేసిన ఈ భారత బ్యాటర్.. వరుసగా రెండో సెంచరీ నమోదు చేశాడు. చివరి ఐదు టీ20ల్లో అతనికిది మూడో శతకం.
ఇంత టాలెంట్ ఉన్న ఆటగాడు.. ఇన్నాళ్లు భారత జట్టులో అడపాదడపా కనిపించడమేంటనేది జరుగుతోన్న చర్చ. అతన్ని కావాలనే కొందరు భారత ఆటగాళ్లు తొక్కేశారనే ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. అందుకు కారణం.. సంజూ తండ్రి శాంసన్ విశ్వనాథ్. నాలుగు రోజులు క్రితం శాంసన్ విశ్వనాథ్ పలువురు భారత ఆటగాళ్లపై విమర్శలు గుప్పించారు. మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సహా రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్‌లు తన కుమారుడి పదేళ్ల కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించారు. అదే సమయంలో అతనిలోని నైపుణ్యాన్ని గుర్తించి మరిన్ని అవకాశాలిస్తున్న ప్రస్తుత భారత కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
ధోని, కోహ్లీ తొక్కేశారు..!
శాంసన్ తండ్రి చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నాయి. భారత మాజీ కెప్టెన్లు ధోని, కోహ్లీలు సంజూను తొక్కేశారని అతని అభిమానులు సోషల్ మీడియాలో గళం విప్పుతున్నారు. భారత మాజీ కెప్టెన్లకు వ్యక్తిరేకంగా పోస్టులు పెడుతున్నారు. టీ20ల్లో వరుసగా సెంచరీలు చేసిన ఆటగాడు, ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడు టీ20 శతకాలు నమోదు చేసిన మొనగాడు ఎవరైనా ఉంటే తమకు చూపెట్టాలని సవాల్ విసురుతున్నారు. ఈ వ్యాఖ్యలకు ధోని, కోహ్లీల అభిమానులు అదే రీతిలో కౌంటర్లు ఇస్తున్నారు.
Also Read :- 5 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు
శాంసన్ విశ్వనాథ్ ఆరోపణలు నిజమేనా..!
ఎప్పుడో తొమ్మిదేళ్ల కృతం 2015లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేసిన శాంసన్ ఇప్పటివరకూ 37 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ గణాంకాల ఆధారంగా అతనికి ఎక్కువగా అవకాశాలు రాలేదని చెప్పాలి. అదే సమయంలో వచ్చినవాటిని అతను సద్వినియోగం చేసుకోలేదని కూడా చెప్పొచ్చు. అతను ఆడిన 37 మ్యాచ్‌ల్లో ఆరేడు తప్ప చెప్పుకోదగిన ఇన్నింగ్స్‌లు ఏవీ లేవు. ఐపీఎల్‌లో నిలకడగా ఆడే సంజూ.. జాతీయ జట్టుకు అలాంటి ఇన్నింగ్స్‌లు ఆడిన సందర్భాలు ఈ ఏడాది ముందు వరకూ ఒక్కటంటే ఒక్కటీ లేవు.
ఇటీవల సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడం.. జైస్వాల్, గిల్ వంటి యువ క్రికెటర్లు టెస్ట్ సిరీసులకు అతక్కుపోవడంతో అతనికి వరుస అవకాశాలు వస్తున్నాయి. రాణిస్తున్నాడు. అంతే తప్ప అతని కెరీర్‌ను నాశనం చేశారనే సంజూ తండ్రి మాటలను మాజీలు సైతం అంగీకరించడం లేదు.
Sanju Samson's last 5 T20I innings:
— ESPNcricinfo (@ESPNcricinfo) November 15, 2024
? Hundred
? Duck
? Duck
? Hundred
? Hundred
????? ????? pic.twitter.com/WBqZmo5eZD