Astrology: 12 ఏళ్ల తరువాత   కన్యారాశిలోకి ...గురుడు, చంద్రుడు.. మూడు రాశుల వారికి గజకేశరి యోగం 

సంపద, సంతోషాలకు కారకుడైన దేవ గురువు అయిన  గురుడు...  మనసుకు కారకుడైన చంద్రుడు జూన్​ 14న  కన్యారాశిలోకి ప్రవేశించారు. . జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  12 సంవత్సరాల తర్వాత జూన్ 14న కన్యా రాశిలో బృహస్పతి, చంద్రుల కలయిక కారణంగా మూడు రాశుల వారికి  గజకేసరి రాజయోగం వస్తుంది. జ్యోతిష్య సిద్దాంతులు తెలిపిన వివరాల ప్రకారంగా  కర్కాటక, మిథున, ధనస్సు రాశుల వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది.  కన్యారాశిలోకి గురుడు, చంద్రుడు ప్రవేశం వలన ఏ రాశి వారికి ఎలాఉందో తెలుసుకుందాం. . . 

హిందూ క్యాలెండర్ ప్రకారం చంద్రుడు జూన్ 14న కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు.  కన్యారాశిలో ఈ గ్రహాలు రెండున్నర సంవత్సరాలు వాటి స్థానాలను మార్చుకుంటూ సంచరిస్తాయి, అత్యంత వేగంగా రాశి చక్రాన్ని చంద్రుడు మార్చుకుంటాడు. రెండున్నర రోజుల పాటు చంద్రుడు ఒక రాశిలో ఉంటాడు. గురుని  ఐదవ అంశం చంద్రునిపై పడటం వల్ల మూడు రాశుల వారికి గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రాజయోగం అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు.

చంద్రుడు ఒక రాశి చక్రంలో సంచరించి గురుని  శుభ దర్శనం ఆ రాశిలో పడితే గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. జాతకంలో ఈ యోగం ఉంటే శత్రువులపై విజయం సాధించగలుగుతారు. జీవితంలో ఎలాంటి సవాలును అయినా అధిగమించగలుగుతారు. ఈ యోగంతో  కర్కాటక, మిథున, ధనస్సు రాశుల వారికి  సంపద విపరీతంగా పెరుగుతుంది. విలాసాలు పొందుతాడు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. జ్ఞానం పెరిగి మంచి జీవితాన్ని గడుపుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

మేష రాశి: గురుడు, చంద్రడు... ఈ  రెండు గ్రహాలు కన్యారాశిలో కలవడం వలన మేషరాశి వారికి  ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. వృత్తిలో కొన్ని ఆటంకాలు ఏర్పడినా..  కొత్త అవకాశాలు ఏర్పడతాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు వృత్తి, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి.  అయితే ఆర్ధిక వ్యవహారాలు స్వల్ప మార్పులు చోటు చేసుకొని కొద్ది మొత్తం మేరకు బ్యాంక్ బాలెన్స్ పెరిగే అవకాశం ఉంది. కాని ఇతరులతో వాగ్వాదం పెట్టుకోవద్దు.  ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలయించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

వృషభరాశి:  గురుడు కన్యారాశిలోకి జూన్​ 14న ప్రవేశించాడు . దీని ఫలితంగా  వృషభ రాశి వారికి అతి కష్టంతో  పురోగతి.. విజయాన్ని సాధిస్తారు.   కెరీర్ లో  అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఒడిదుడికులతో ప్రమోషన్, కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు  ఈ సమయం అనుకూలం లేదు. వ్యాపారస్తులకు నష్టాలు లేకపోయినా.. లాభాలు రావు.  కొత్తగా పెట్టుబడులుపెట్టకపోవడమే మంచిది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. రుద్రాభిషేకం, హనుమాన్​ చాలీసా పఠనం ద్వారా ఉపశమనం కలుగుతుంది. 

మిథున రాశి:  చంద్రుడు.. కన్యారాశిలో ప్రవేశించడంతో  మిథున రాశి వారికి  అత్యంత ఫలవంతమైనది. సౌభాగ్యంతో పాటు లగ్జరీ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి  తగ్గుతుంది. జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఆస్తికి సంబంధించి ఏదైన వివాదం నడుస్తుంటే అది పరిష్కారం అవుతుంది. ఉద్యోగస్తులు తమ సీనియర్లను మెప్పిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మెరుగైన పురోగతి ఉంటుంది.  ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇది చాలా అనుకూలమైన సమయం.  ప్రైవేట్​ ఉద్యోగస్తులకు ప్రమోషన్​ రావడంతో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. 

కర్కాటక రాశి: గురుని  ఐదవ అంశ కన్యారాశిలోకి ప్రవేశించడంతో ..  కర్కాటక రాశి మూడో  ఇంటిపై గురుని అంశ  పడుతుంది. ఇది చంద్రుడి రాశి. అలాగే బృహస్పతి ఉన్నతమైన రాశి కర్కాటక రాశి. గజకేసరి రాజయోగం వల్ల వ్యక్తి ఆనందం, శ్రేయస్సు, సమృద్ధి అందిస్తుంది. ఫలితంగా   కొత్త పనులు శ్రీకారం చుట్టేందుకు అనువైన కాలం. ప్రతి పనిని శ్రద్ధగా చేయడం వల్ల విజయం సాధిస్తారు. తోబుట్టువులతో సంబంధం బలపడుతుంది. కెరీర్ మెరుగుదల కోసం మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం లభిస్తుంది.

సింహరాశి: కన్యారాశిలోకి చంద్రుడు, గురుడు ప్రవేశించడంలో వలన సింహరాశి వారికి  సంతృప్తి కరంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి సమయం.  ఉద్యోగస్తులు సహోద్యోగుల నుంచి  ప్రశంసలు అందుకుంటారు. బదిలీ కోసం ప్రయత్నిస్తుంటే .. అనుకున్న ఫలితాన్ని పొందుతారు.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం ఉంది. అయితే శని .. రాహు గోచారం బాగుండదు కాబట్టి ఎముకలు . గ్యాస్ట్రిక్ సంబంధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్త అవసరమని పండితులు సూచిస్తున్నారు.

కన్యా రాశి:  గురుడు,,  చంద్రుడు  కన్యారాశిలోకి ప్రవేశించడం వలన .. కన్యారాశి వారికి అనుకూలమైన ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చినట్టే వచ్చి చేజారుతుంది.  అయినా వీరు చేసే పనిలో మీరే కీలకంగా వ్యవహరిస్తారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు విజయం సాధిస్తారు. మానసిక ఒత్తిడి వలన ఆరోగ్యంకొంత దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని విషయాలకు కాలమే పరిష్కారం చూపుతుందని మనో నిబ్బరంగా ఉండండి.  ఆర్దికంగా కొంత వృద్ది చెందినా అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.  విష్ణు సహస్రనామం..లక్ష్మీ పూజ చేయండి. 

తులారాశి:  కకన్యారాశిలో.. చంద్రుడు, గురుడు కలయిక వలన తులారాశి వారికి  మిశ్రమ ఫలితాలుంటాయి. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారంగా  ఆర్థికంగా ...  కెరీర్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులు..  మీరు చేయని పనికి కూడా పై అధికారులు అపార్దం చేసుకునే అవకాశాలున్నాయి.  ఎవరితోనూ ఎక్కువుగా మాట్లడకండి... ఎవరికి ఎలాంటి వాగ్డానాలు ఇవ్వవద్దు.    . మీరు చేపట్టే ప్రతి పనిలో  ఆలస్యం .. అడ్డంకులు వస్తాయి. ఆశించిన ఫలితాన్ని పొందడానికి మీరు చాలా కష్టపడాలి. బుధుని గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ ఎనిమిదవ ఇంటిలో కుజుడి సంచారం కారణంగా పరీక్షల్లో తొందరపాటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు ఓపికగా ప్రశాంతంగా పరీక్షలు రాయడం మంచిది.

వృశ్చిక రాశి: గురుడు, చంద్రుడు కన్యారాశిలో సంచరించే సమయంలో  అధికంగా కష్టపడాల్సి ఉంటుంది.  శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. అనుకోని పరిస్థితుల వలన కొంతకాలం వేరే ప్రదేశంలో పరిచేయాల్సి రావచ్చు.  కార్యాలయంలో సహోద్యోగులు, పై అధికారుల మద్దతు ఉంటుంది. అధిక పని వలన కొంత చికాకు ఏర్పడుతుంది.  ఎవరితోనూ వాదన పెట్టుకోకుండా మీ పని మీరు చేయండి.  ఫలితం దానికదే వస్తుంది. ఆరోగ్యంగా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది.  ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.  స్థిరాస్థులు వృద్ది చెందే అవకాశం కలదు. సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పనిచేయడంతో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు.

ధనుస్సు రాశి : ధనుస్సు రాశి పదో ఇంట్లో గజకేసరి యోగం ఏర్పడబోతుంది. అన్ని రకాల భౌతిక ఆనందాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఇది గొప్ప సమయం. కెరీర్ లో మీరు విజయం సాధించేందుకు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్ట్ లేదా వెంచర్ లో పని చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. పనిలో మీకు మీ సీనియర్లకు మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వం నుంచి కూడా ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారం నడుపుతున్న వారికి ఇది అద్భుతమైన సమయం.

మకర రాశి: కన్యారాశిలో గురుడు, చంద్రుడు సంచరించడం వలన మకర రాశి ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి అనుకూలమైన సమయం.  ఆర్థికంగా పురోగతి  ఉంటుంది.  అయితే మీరు చేయాలనుకునే పనిలో స్వల్ప ఆటంకాలు వస్తాయి.  నిరుత్సాహ పడకుండా.. ముందుకు సాగండి. కొత్త వెంచర్లు ప్రారంభించాలకునేవారు.. ముందుగా దైవ దర్శనం చేసుకొని ఆ తరువాత ప్రారంభించండి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి. మెత్తంగా పరిశీలిస్తే మకరరాశివారికి అనుకూలమైన ఫలితాలు పొందుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కుంభ రాశి: కుంభ రాశి వారికి ఈ సమయంలో పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. సంతోషంగా, సంతృప్తికరమైన ఆర్థిక లాభాలు పొందుతారు. మతపరమైన కార్యక్రమాలలో మీకు గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. విదేశాలకు వెళ్తారు. అన్ని రకాల రుణాలు తీర్చుకోగలుగుతారు. కుబేరుడి దయతో సంపద నిల్వలు పెరుగుతాయి.

మీన రాశి : ఈ వారికి గురుడు.. చంద్రుడు కన్యారాశిలో సంచారం వలన మిశ్రమ ఫలితాలుంటాయి.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​పొందే అవకాశం ఉంటుంది.  పనిభారంతోపాటు అదనపు బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది. కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది.  కుటుంబ విషయాల కారణంగా అనవసరంగా డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో సానుకూల ఫలితం ఉంటుంది. మీరు మీ స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశానికి కూడా ప్రయాణం చేయవచ్చు. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం,  సంపాదనలో మెరుగైన వృద్ధిని మరియు ఊహించని డబ్బు ను పొందుతారు.