బిల్డింగ్ పై విమానం కూలింది.. ఎక్కడంటే

ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు ఎక్కవవుతున్నాయి.   ఇటీవల సౌత్ కొరియా, కజకిస్థాన్ లలో వరుసగి విమాన ప్రమాదాలు జరిగాయి.  ఇప్పుడు అమెరికాలో మరో విమానం ప్రమాదానికి గురయింది.  సౌత్ కాలిఫోర్నియాలో ఓ విమానం బిల్డింగ్ పై కూలింది.  ఈ ఘటనలో ఇద్దరు మరణించగా... 18 మంది గాయపడ్డారు.  డిసెంబర్ 2 వ తేదిన  ఫుల్లెర్టోన్ లోని ఆరెంజ్ కౌంటీ సిటీలో ఈ ప్రమాదం జరిగింది.

డిస్నీల్యాండ్ కు 10 కిలోమీటర్ల దూరంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే విమానం ప్రమాదం జరిగిన స్థలంలో మంటలు చెలరేగి దట్టంగా పొగ వ్యాపించింది,  సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.  ముందస్తు చర్యగా ప్రమాదం జరిగిన భవనానికి చుట్టు పక్కప ఉన్న వారికి ఖాళీ చేయించారు. విమానం కూలిన భవనం కమర్షియల్ సముదాయమని, బిల్డింగ్ కొంతమేర దెబ్బతిన్నదని పోలీసులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదం జరిగిన గోడౌన్ లో కుట్టు మిషన్లు.. టెక్స్ టైల్ కు సంబంధించిన రా మెటీరియల్ ఉందని గుర్తించారు.