హ్యాపీ క్రిస్మస్.. అంటూ వచ్చేస్తున్నారు ఈ బుజ్జి శాంటాలు. గిఫ్ట్ గా బోలెడు నవ్వుల్ని మోసుకొస్తున్నారు. మరి మన ఇండ్లలోని బుజ్జోళ్ల మాటేంటీ... వాళ్లని కూడా లిటిల్ శాంటాలుగా రెడీ చేయాలి. మరింకెందుకు ఆలస్యం.. బుజ్జాయిల కోసం శాంటా డ్రెస్లు వెతికేయడమే. ఇవి ఐదొందల రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి.
కాకపోతే పిల్లలకి ఈ డ్రెస్ వేసేముందు కొంచెం కేర్ తప్పనిసరి.. ఎక్కువసేపు శాంటా డ్రెస్లోలో ఉండాలంటే పిల్లలకి ఇబ్బందే.. అందువల్ల ఒకటిరెండు గంటల్లో డ్రెస్ మార్చాలి. మరీ టైట్ గా ఉండే డ్రెస్ ల జోలికి వెళ్లొద్దు. కాటన్, ఉలెన్ డ్రెస్లు వేయడం బెటర్. క్రిస్మస్ బేబీ రోపర్, శాంటా స్క్వాడ్ టీ షర్ట్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. వాటిని కూడా ట్రై చేయొచ్చు.