ఇటాలియన్ ఐలాండ్​లో..మేకల దత్తత!

ఇటాలియన్ ఐలాండ్​లో జంతువుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో ఆ ఐలాండ్ మేయర్ రిక్కర్డొ ఒక ప్లాన్ వేశారు. యానిమల్ ఓవర్​ పాపులేషన్​ ప్రాబ్లమ్​కి చెక్​ పెట్టేందుకు కనీవినీ ఎరుగని ఆఫర్ ఒకటి ప్రక టించాడు. ఆ ఆఫర్ తెలిస్తే ఔరా! అనాల్సిందే ఎవరైనా.

‘సిసిలీ ఎయొలియన్ ఆర్కిపెలాగో’ ద్వీపానికి మేయర్ రిక్కర్డొ గుల్లొ. ఇదో చిన్న ఐలాండ్​. ఇక్కడి మనుషుల కంటే అడవి మేకల జనాభా బాగా పెరగడంతో ‘అడాప్ట్–ఎ–గోట్’ ప్రోగ్రామ్ మొదలుపెట్టాడు మేయర్​. మేకల్ని దత్తత తీసుకోవాలి అనుకున్న వాళ్లు ప్రభుత్వానికి ఇ–మెయిల్​ చేసి,17 డాలర్ల ‘స్టాంప్ ఫీజు’ కట్టాలి. అలా కోరుకున్నన్ని మేకల్ని దత్తత చేసుకోవచ్చు. మేక కోసం రిక్వెస్ట్ పెట్టే వాళ్లు రైతులే కానక్కర్లేదు. ఆసక్తి ఉన్న వాళ్లు ఎవరైనా తీసుకోవచ్చు.

ఈ పథకం ప్రస్తుతం ఏప్రిల్ 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఆ గడువు పొడిగించే అవకాశం కూడా ఉందన్నారు కొందరు ప్రభుత్వ అధికారులు. దత్తత తీసుకోవాలనుకున్న వాళ్లు వాటిని తినడానికి కాకుండా.... పెంచుకోవడానికి ప్రయత్నిస్తే చూడాలనుకుంటుందట ఆ ఐలాండ్​ ప్రభుత్వం. ఈ ద్వీపంలోని మేకల మంద సుమారు 20 ఏండ్ల కింద మొదలైంది. మేకల్ని మేపడానికి ఇక్కడికి తీసుకొస్తే అవి మంద నుంచి తప్పిపోయి అడవి మేకలుగా మారాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే... మేకలు ఈ ద్వీపానికి టూరిస్ట్​ అట్రాక్షన్​గా మారడం. అంతవరకు బాగానే ఉంది కానీ ఆ అడవి మేకల సంఖ్య బాగా ఎక్కువైపోయి, తోటలు, ఇళ్లపై దాడి కూడా చేస్తున్నాయట.