నిమ్స్​లో బీఎస్సీ(నర్సింగ్) కోర్సులో అడ్మిషన్స్​

హైదరాబాద్‌‌లోని నిజాం ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2024-–25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ(నర్సింగ్) కోర్సులో అడ్మిషన్స్​కు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌‌లైన్‌‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌‌ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)ఉత్తీర్ణులై ఉండాలి. టీజీ ఈఏపీసెట్‌‌-2024లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి. వయసు 17 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్​: టీజీ ఈఏపీసెట్‌‌-2024 ర్యాంకు, రూల్‌‌ ఆఫ్‌‌ రిజర్వేషన్‌‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఆగస్టు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.2,000 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు www.nims.edu.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.