యాదాద్రి, వెలుగు : మిల్లుల వద్ద వడ్లను త్వరగా అన్ లోడ్ చేయించాలని అడిషనల్ కలెక్టర్ బెన్ షా లోమ్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. మిల్లులకు ఇచ్చిన కెపాసిటీని పూర్తి చేయాలన్నారు. రైతుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
మిల్లుల్లో అవసరమైన స్పేస్ పెంచుకొని వెంటనే అన్ లోడ్ చేయించాలని సూచించారు. సమావేశంలో సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ గోపీకృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాసరెడ్డి, రైస్ మిల్లుల ప్రతినిధులు పాల్గొన్నారు.