బాల్కొండ,వెలుగు : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ అన్నారు. శుక్రవారం బాల్కొండ, ముప్కాల్ లో పర్యటించారు. ఎంపీడీఓ, ఎమ్మార్వో ఆఫీసులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు చేపట్టే చర్యలపై ఆరా తీశారు. ప్రజలు దోమకాటుకు గురికాకుండా ఉండేందుకు ఫాగింగ్ చేయించాలన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
బీఎల్ఓలు ఇంటింటి సర్వే చేస్తున్నారన్నారు. ఓటరు లిస్ట్, వార్డుల మెర్జింగ్ పరిశీలించి తీసుకుంటున్న ముందస్తు చర్యలను అడిగి తెలుసుకున్నారు. అమ్మ ఆదర్శ స్కూళ్లను తనిఖీ చేసి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి,తహసీల్దార్ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.