పోలింగ్​ సెంటర్లపై అభ్యంతరాలుంటే తెలపాలి : కలెక్టర్​ అంకిత్

నిజామాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల​ నిర్వహణ కోసం రూపొందించిన ముసాయిదా పోలింగ్​సెంటర్ల లిస్ట్​పై అభ్యంతరాలుంటే తెలపాలని అదనపు కలెక్టర్​ అంకిత్​ కోరారు. 12లోగా కారణాలు తెలియజేస్తే 13న పరిశీలించి 17న ఫైనల్​ లిస్టు ప్రకటిస్తామన్నారు.    మంగళవారం పొలిటికల్​పార్టీ లీడర్లతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. 

జిల్లాలోని మొత్తం 545 గ్రామ పంచాయతీల పరిధిలో 5,022 వార్డులున్నాయన్నారు. ఎన్నికల కమిషన్​ మార్గదర్శకాలకు లోబడి 5,053 పోలింగ్​ సెంటర్లు ఏర్పాటుకు ముసాయిదా రూపొందించామన్నారు. లిస్ట్​ పరిశీలించి అభ్యంతరాలుంటే తెలపాలన్నారు.  కార్యక్రమంలో ఇన్​చార్జి​ డీపీవో శ్రీనివాస్, ఆర్మూర్​ఆర్డీవో రాజాగౌడ్​ తదితరులు పాల్గొన్నారు.