డెస్క్​టాప్​, పాత ల్యాప్​టాప్​ల్లో ఫింగర్​ ప్రింట్​ ఇలా సెట్ చేస్కోండి..!

ఈ మధ్య లాంచ్​ చేస్తున్న అన్ని హై–ఎండ్​ ల్యాప్​టాప్​ల్లో ఫింగర్​ ప్రింట్​ రీడర్లు ఇన్​బిల్ట్​గా వస్తున్నాయి. కానీ.. డెస్క్​టాప్​, పాత ల్యాప్​టాప్​ల్లో ఈ ఫీచర్​ లేదు. వాటికి కూడా ఫింగర్​ప్రింట్​ ఫీచర్​ని యాడ్​ చేసుకునేందుకు ఈ గాడ్జెట్​ని తీసుకొచ్చారు. ‘ఎమిసీ స్మార్ట్’ అనే కంపెనీ దీన్ని మార్కెట్‌లో అమ్ముతోంది. ఇది యూఎస్​బీ పెన్​డ్రైవ్ కంటే చిన్నగా ఉంటుంది. యూఎస్​బీ పోర్ట్​ ద్వారా ల్యాప్​టాప్​కు కనెక్ట్​ చేసుకోవచ్చు.

ఇది విండోస్​ 11,10కి సపోర్ట్​ చేస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా డ్రైవర్స్​ ఇన్‌స్టాల్​ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సింపుల్​ సెట్టింగ్స్​తో దీన్ని యాక్టివేట్​ చేసుకోవచ్చు. అడ్వాన్స్​డ్​ లెర్నింగ్​ అల్గారిథమ్​తో పనిచేస్తుంది. ఫింగర్​ ప్రింట్‌ని 0.05 సెకన్లలోనే స్కాన్​ చేయగలదు. అంతేకాదు.. 360 డిగ్రీ ఫింగర్ ​ప్రింట్​ రీడింగ్​ కెపాసిటీతో వస్తుంది. 10 ఫింగర్​ ప్రింట్​ ఐడీలను గుర్తుంచుకోగలదు. ధర: 2,570 రూపాయలు