కొండగట్టు/ధర్మపురి/వేములవాడ, వెలుగు: నటుడు శ్రీకాంత్ ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు అంజన్న, ధర్మపురి ఆలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికి స్వామివార్ల ప్రతిమలను అందజేసి శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ఆలయాలను సందర్శించి స్వామివార్లను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కొండగట్టు అంజన్నను మూడోసారి, వేములవాడ రాజన్నను తొలిసారి దర్శించుకున్నట్టు తెలిపారు. గేమ్ చేంజర్ సినిమాలో నటించానని, వచ్చే ఏడాదిలో విడుదల కానుందన్నారు. ఇద్దరు హీరోలతో మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. ఆయన వెంట నటుడు చంద్రకాంత్, నిర్మాత విజయ్, కొండగట్టు, రాజన్న ఆలయాల అధికారులు ఉన్నారు.