డిఫరెంట్ కాన్సెప్టులను సెలెక్ట్ చేసుకుంటూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు అడివి శేష్(Adivi Sesh). యాక్టింగ్, రైటింగ్ తో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం అడవి శేష్ ఖాతాలో రెండు పాన్ ఇండియా చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
అయితే, ఈ సినిమాల అనౌన్స్ మెంట్ వచ్చి రెండు సంవంత్సరాలు కావొస్తున్నా.. అప్డేట్స్ మాత్రం పోస్టర్కి మించి రాలేకపోతున్నాయి. దీంతో చాలా కాలంగా శేష్ ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ సినిమాలేంటి? వాటి అప్డేట్స్ ఏంటనేది చూద్దాం.
ఈ నేపథ్యంలో అడివి శేష్ తాజాగా డిసెంబర్ 7న తన రెండు సినిమాల అప్డేట్స్పై ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ హీరో డెకాయిట్, గూఢచారి2 సినిమాలలో నటిస్తున్నాడు. 'ఈ డిసెంబర్లో డెకాయిట్, 2025 జనవరిలో గూఢచారి2 అప్డేట్స్ రానున్నాయి' అంటూ పోస్ట్ చేశాడు.
Also Read :- ఓటీటీకి యానిమల్ బ్యూటీ బోల్డ్ మూవీ
అయితే, వచ్చేది టీజర్, ట్రైలర్ అయితేనే.. తాను చేసిన పోస్ట్కి న్యాయం జరుగుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే, అడివి శేష్ నుంచి సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది. చివరిగా 2022 లో 'హిట్ ది సెకెండ్ కేస్' లో నటించాడు.
December #DACOIT surprise :)
— Adivi Sesh (@AdiviSesh) December 7, 2024
January #G2 surprise :)
❤️?
ఇక డెకాయిట్ విషయానికి వస్తే.. అడివి శేష్, శృతిహాసన్ లీడ్ రోల్స్‌లో ‘డెకాయిట్’ (Dacoit) రూపొందుతుంది. షానీల్ డియో దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
గూఢచారి సినిమాకి సీక్వెల్గా వస్తోన్న G2 (Goodachari 2) పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్తో లావీష్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కనుందని సమాచారం.