Lifestyle: రోజంతా హుషారుగా ఉండాలంటే ఏంచేయాలో తెలుసా..

ప్రస్తుతం జనాలు చిన్న దానికి కూడా చిరాకు పడుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి బారిన పడుతున్నారు. ఉదయం ఉండే యాక్టివ్​ నెస్​.. చలాకీతనం..   హుషారు సాయం త్రానికి ఉండదు. నచ్చని విషయాలు చేయాల్సి వచ్చినా.. నచ్చని మాటలు విన్నా  ...   మనకు తెలియకుండానే ఆందోళన మొదలవుతుంది.  దాని నుంచి బయట పడాలనుకుంటారు.. కాని దాని గురించే ఆలోచించడం వల్ల అది వీలు కాదు.  ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే ఎలాంటి పద్దతులు అవలంభించాలో తెలుసుకుందాం, , ,

 ముందు మనం నింసించే ఇంటి పరిసరాలు ఎలా ఉన్నాయో పరిశీలించాలి.  చాలా చెత్తగా ఉంటే ముందు వాటిని క్లీన్​ చేసుకోవాలి.  లేదంటే చికాకు.. నిస్సత్తువ కలుగుతుంది.  స్నేహితులతో సరదాగా మాట్లాడటం వల్ల ఒత్తిడి నుంచి బయట పడవచ్చు. బిగ్గరగా నవ్వడం వల్ల మనసు తేలిక పడి... . ఒత్తిడి దూరం అవుతుంది.  ఏదైనా ఒత్తిడి.. చికాకు.. టెన్షన్​ వచ్చిందంటే.. ఆ ఆలోచన రాకుండా ఉండాలంటే  వీలైనంత వరకు స్నేహితులతో గడపాలి. 

ALSO READ | Good Health:రోజూ 3 కప్పుల బ్లాక్ కాఫీ.. షుగర్ కంట్రోల్.. గుండె జబ్బులకు చెక్..!

ఒక డైలీ రొటీన్​ గా పని చేస్తూనే ఉంటాం.  అయితే ఆ పని ... ఒకేవిధంగా చేస్తే బోర్ గా ఫీలవుతాం. కాబట్టి కొంచెం డిఫరెంట్​గా  చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు మెదడు పనితీరు కూడా అభివృద్ది చెందుతుంది.  ఇక రన్నింగ్, యోగా చేయడం వల్ల కూడా హుషారుగా ఉండొచ్చు. మెడిటేషన్​ ను  రొటీన్ లైఫ్ లో భాగం చేసుకుంటే... నెగిటివ్ ఆలోచనలు దూరమవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.  ప్రాణాయామం, శ్వాస మీద ధ్యాస లాంటివి చేయడం వల్ల ఆందోళ నలను దూరం చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకే ప్రాంతంలో ఉంటే, ఆ పరిసరాలు విసుగును తెప్పిస్తాయి. కాస్త పనిచేసే చోటును మార్చుకుంటే బాగుంటుంది. ఇంటికి దగ్గర్లో ఏదైనా పార్కు ఉంటే... అక్కడ కొద్ది సేపు గడిపితే ఆ ఆనందమే వేరు. పచ్చని పరిసరాలు మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి.