మున్సిపల్ ​ఆస్తులు నష్టపరిచే వారిపై చర్యలు తీసుకోవాలి

ఆర్మూర్, వెలుగు: మున్సిపల్​ఆస్తులకు నష్టం చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు గురువారం ఆర్మూర్ మున్సిపల్​ఆఫీస్​ లో కమిషనర్ కుర్చీకి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. తాము గతంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినప్పటికీ కమిషనర్​ చర్య తీసుకోలేదన్నారు.  కనీసం వినతి పత్రం తీసుకునేందుకు సమయం ఇవ్వనందునే వినూత్నంగా నిరసన తెలిపామని  బీజేపీ మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్ జీవీ నర్సింహారెడ్డి తెలిపారు. మున్సిపల్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్​ ద్యాగ ఉదయ్, ఆకుల శ్రీనివాస్, మందుల బాలు, బాశెట్టి రాజ్ కుమార్, ఉదయ్​ గౌడ్, దోండి ప్రకాశ్​ తదితరులు పాల్గొన్నారు.