Viral Video: హ్యాట్సాఫ్ : పశువులకూ ఏసీలు పెట్టారు

ఎండాకాలం.. ఉక్కపోత.. చెమటతో పడే ఇబ్బంది అంతా .. ఇంతా కాదు.. ఏ పని చేద్దామన్న చిరగ్గా ఉంటుంది. అందుకే ఉపశమనం కోసం ఏసీలు.. కూలర్లు.. ఫ్యాన్లు వాడుతుంటారు.. ఎండాకాలం మనుషలకే  కాదండోయ్​ జంతువులకు కూడా చాలా చిరాగ్గా ఉంటుంది.  ఓ వ్యక్తి పాలవ్యాపారం చేస్తున్నాడు.  ఎండకు  గేదెలు పాలు ఇవ్వాలంటే చిరాకు పడుతున్నాయనుకున్నాడో ఏమో తెలియదు కాని... వెంటనే గేదెల షెడ్​ ను ఏసీ షెడ్​ గా మార్చాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే 

ఈ ఏడాది ( 2024) మండిన ఎండలకు అందరూ  ఇబ్బందిపడ్డారు. రోజురోజుకూ పెరిగిన ఉష్ణోగ్రత జనాలను బెండేలెత్తించింది.  వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఏసీలను, కూలర్లను ఆశ్రయించారు.  మనుషుల సంగతి పక్కన పెడితే ఈ భారీ ఉష్ణోగ్రతల కారణంగా జంతువులు కూడా ఎంతో ఇబ్బందిపడ్డాయి అందుకే ఓ వ్యక్తి పెద్ద మనసు చేసుకుని తన గేదెల గురించి కూడా ఆలోచించాడు. ఆయన ఓపెన్ మైండ్ తో తన గేదెల గురించి కూడా ఆలోచించాడు. అతను గేదెల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్ కండిషన్డ్ గదిని కూడా తయారు చేయించాడు.

 ఓ వ్యక్తి గెదెల కోసం ప్రత్యేకంగా ఓ రూమ్ సిద్ధం చేశాడు.  మొత్తం క్లోజ్ చేసి ఉన్న రూమ్‌లో ముర్రా జాతి గేదెలను ఉంచాడు.ముర్రా జాతి గేదెలను ఇంటి లోపల ఉంచి ఏసీ గదిలో పెంచుతున్నారు. గదిలో రెండు ఎయిర్ కండీషనర్లు అమర్చాడు సదరు రైతు. (ACs for the Buffaloes). ఫ్యాన్లు, లైట్ కూడా అమర్చాడు. పెరుగుతున్న ఎండలు గేదెలను ఇబ్బంది పెట్టకుండా సకల ఏర్పాట్లు చేశాడు. . వాటితోపాటు ఫ్యాన్, లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఉదయం పూట తన గేదెలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో @Gulzar_sahab ఖాతా లో పోస్ట్​ చేయడంతో.. అది కాస్త  ..వైరల్ అవుతోంది.

ఆ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. దాదాపు 30 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.  బ్రదర్.. అవి జంతువులు. వాటిని ఆరు బయట ఉంచండి... ఏసీల వల్ల వాటి ఆరోగ్యం పాడవుతుంది అని ఒకరు పోస్ట్​ చేయగా మరొకరు అవి ముర్రా జాతి గేదెల వేడిని తట్టుకోలేవు..  ఇవి అంబానీ గేదెలు ..ఆ వ్యక్తి చాలా ధనవంతుడిలా ఉన్నాడని అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.