డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినవారికి జైలు శిక్ష, ఫైన్

ఖమ్మం టౌన్, వెలుగు :  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన ఖమ్మం నగరానికి చెందిన ఆటో  డ్రైవర్ కు  ఖమ్మం స్పెషల్ జ్యుడీషయల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి  మూడు రోజులు జైలు శిక్ష విధించారు. మరికొందరికి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఫైన్​ వేశారు. 

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతోందన్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.