వృద్ధురాలి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

గోదావరిఖని, వెలుగు : రామగుండం పట్టణంలోని ముబారక్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌లో 2019లో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదుతో పాటు, రూ. 500 ఫైన్‌‌‌‌‌‌‌‌ విధిస్తూ గోదావరిఖని అదనపు జిల్లా జడ్జి టి.శ్రీనివాసరావు బుధవారం తీర్పు చెప్పారు. ముబారక్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన సమ్మెట తిరుపతికి అదే కాలనీకి చెందిన నగునూరి నరేశ్‌‌‌‌‌‌‌‌ మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2019  మార్చి 1న నరేశ్‌‌‌‌‌‌‌‌ తిరుపతి తల్లి బాలమ్మపై గొడ్డలితో దాడి చేయడంతో ఆమె చనిపోయింది. 

తిరుపతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నరేశ్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు కోర్టులో చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. ప్రస్తుత రామగుండం సీఐ అజయ్‌‌‌‌‌‌‌‌బాబు, ఎస్సై కందునూరి సతీష్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ సీహెచ్‌‌‌‌‌‌‌‌.వెంకటేశ్వర్లు, కోర్ట్‌‌‌‌‌‌‌‌ లైజన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ కొత్తకొండ శంకర్‌‌‌‌‌‌‌‌లు 14 మంది సాక్ష్యులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌‌ తరఫున అదనపు పబ్లిక్‌‌‌‌‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌ టి.జ్యోతిరెడ్డి వాదనలు వినిపించారు. నరేశ్‌‌‌‌‌‌‌‌పై నేరం నిరూపణ కావడంతో జీవిత ఖైదు, ఫైన్‌‌‌‌‌‌‌‌ విధిస్తూ జడ్జి టి.శ్రీనివాసరావు తీర్పు చెప్పారు.