Vastu Tips : వాషింగ్ మెషీన్ ఏ దిక్కులో ఉండాలి.. మన ఇంటి చుట్టుపక్కల వాళ్ల వాస్తు దోషాలు మన ఇంటిపై పడతాయా..?

ఇంటిని చాలా అందంగా కట్టుకుంటాం.. వాస్తు పద్దతులు పాటిస్తాం. అయితే వాస్తు ప్రకారం   కొన్ని వస్తువులు ఉండాల్సిన ప్రదేశంలో పెట్టకపోతే కష్టాలు నష్టాలు వస్తాయి.  అలాగే ఇంటికి ఆనుకొని ఇతరుల  ఇళ్లు ఉంటే ఏమవుతుంది.. పరిసరాలు ఎలా ఉండాలి..  పడమర దిక్కున స్థలం కొనవచ్చా  .. ఇలాంటి విషయాల గురించి వాస్తు సిద్దాంతి కాశీనాథుని శ్రీనివాస్​ సలహాలు సూచనలను తెలుసుకుందాం. 

 గ్రైండర్, వాషింగ్ మెషిన్  వాడుతుంటే శబ్దం వచ్చే వస్తువులు  ఇంట్లో ఎక్కడ పెట్టాలి? ఇలాంటి వాటిని పెట్టేందుకు కూడా వాస్తు ప్రకారం  దిక్కులు చూసుకోవాలా? 

  • ప్రస్తుతం అందరి ఇండ్లలో - గ్రైండర్, వాషింగ్ మెషిన్ లాంటి వస్తువులు ఉంటున్నాయి,  ఇవి  శబ్దాలు చేసే వస్తువులు .. వీటిని వాడటం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు.  అయితే గ్రైండర్ దక్షిణ దిక్కులో  ఆగ్నేయం వైపు మాత్రమే పెట్టుకోవాలి. వాషింగ్ మెషిన్ అయితే వాయువ్యం, ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు.

గోడల వల్ల దోషాలు ఉంటాయా?

పునాదులు, గోడలు, పిట్టగోడలను శాస్త్రబద్ధంగా నిర్మించాలని, లేదంటే దోషాలు కలుగుతాయని కొంతమంది చెబుతుంటారు.   గోడల వల్ల గృహానికి ఎలాంటి దోషాలు ఉంటాయి. ... ఇదెంతవరకు నిజం? 

  • దోషాలు అంటూ ఏమి ఉండవు. వాస్తు ప్రకారం ఎలాగైతే ఇల్లు కట్టుకున్నారో ప్రహరీ, కాంపౌండ్ అలాగే ఉండాలి. ఇంటికి ఆనుకొని ఇతరుల ఇళ్లు కూడా ఉంటాయి. ఆ ప్రభావం కచ్చితంగా ఇంటిపై పడుతుంది. కాబట్టి బేస్​మెంట్ ఫర్​ఫెక్ట్ ఉండేలా మార్పులు చేసుకోవాలి. సొంతింటికి హద్దులు ఉంటే మంచిది.

పరిసరాలకు వాస్తు ఉంటుందా?

వాస్తు బట్టి ఇల్లు కట్టుకున్నా. పరిసరాల వాస్తు కూడా బాగుండాలంటారు అసలు . పరిసరాల వాస్తు అంటే ఏమిటి?

  • ఇంటికి తగ్గట్టుగానే పరిసరాలు కూడా వాస్తు ప్రకారం ఉంటే బాగుంటుంది. బిల్డింగ్, దాని పరిసరాలు రెక్టాంగిల్ లో ఉండాలి. లేదంటే ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇంట్లోవాళ్లు శారీరక సమస్యలతో ఇబ్బందులు పడతారు. వాస్తు కన్సల్టెంట్ ను సంప్రదించాలి. ఇంటికి తగ్గట్టుగా కాంపౌండ్ కొలతలు, ఎత్తులు.. లాంటి వాటిల్లో మార్పులు చేసుకోవాలి.

పడమర వైపు స్థలం కొనచ్చా.?

 ఎప్పట్నుంచో సొంతింటి కోసం ప్లాన్ చేస్తున్న వారు ..పడమర వైపు స్థలం కొని ఇల్లు కట్టుకోవచ్చా.. ..ఆ వైపు ఇల్లు కట్టుకుంటే ఇబ్బందులు ఏమైనా ఉంటాయా?

  • పడమర వైపు స్థలం కొనుక్కోవచ్చు. ఒకసారి వాస్తు కన్సల్టెంట్ ను సంప్రదించి కొనుక్కుంటే మంచిది. అయితే ఇంతకుముందున్న ఇంటికి పడమర దిక్కులో మాత్రం పోవద్దు. దక్షిణం దిక్కు కూడా మంచిది కాదు. దానివల్ల ఇంటికి నష్టాలు, ఆర్థిక సమస్యలు వస్తాయి. ఉన్న ఇంటి భాగంలోనే నిర్మాణం చేసుకోవాలంటే తూర్పు, ఉత్తరం దిక్కుల్లో మాత్రమే కట్టుకోవాలి. ఈ దిశల్లో నిర్మాణం చేసుకుంటే త్వరగా కలిసివస్తుంది. ..అభివృద్ధి కూడా ఉంటుంది.  

–కాశీనాథుని శ్రీనివాస్​, వాస్తుకన్సల్టెంట్​, 94400 88799–