యాదాద్రి జిల్లాలో ఘోరం: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు యువకులు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం (డిసెంబర్ 7) తెల్లవారుజూమున భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ పరిధిలో కారు  అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు యువకులు మృతి చెందారు. చెరువులో కారును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులతో సహయంతో మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. మృతులు హైదరాబాద్‎కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్‎గా పోలీసులు గుర్తించారు. 

మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కారు చెరువులో దూసుకెళ్లడానికి అతి వేగమే కారణమా లేద మరేదైనా రీజన్ ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. చేతికి అందికి వచ్చిన కొడుకులు విగతజీవులుగా మారడంతో మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.