పోలీస్ స్టేషన్‌లోనే రెడ్ హ్యాండెడ్‪గా SI దొరికిండు

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం ఎస్ఐ కృష్ణ కుమార్ లంచం తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వర్ని పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ( నవంబర్ 8)న రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై బి. కృష్ణ కుమార్ అడ్డంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. ఎస్సై ఓ కేసు విషయంలో రూ.20 వేలు ఇవ్వాలని బాధితులను డిమాండ్ చేసినట్లు ఓప్పుకున్నారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఆయనపై BNSS సెక్షన్ 35 కింద కేసు నమోదు చేశారు.