మెట్పల్లిలో ఏసీబికి చిక్కిన ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్

జగిత్యాల జిల్లా మెట్పల్లిలో  ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఏసిబికి చిక్కారు. కొట్టేసిన మామిడి చెట్లు తరలించడానికి పర్మిషన్ కోసం ఓ రైతు నుండి లంచం డిమాండ్ చేశారు. మామిడి చెట్లు తరలించడానికి పల్లెపు  నరేష్ అనే రైతు నుండి రూ. 4500 లంచం డిమాండ్ చేశారు. 

నరేష్  ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు నిఘా పెట్టి  రూ. 4500 లంచం తీసుకుంటుండగా  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు  ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి  తెలిపారు.

ALSO READ | జగిత్యాలలోని ఈ బేకరీలో కుళ్లిపోయిన కోడిగుడ్లు, బూజు పట్టిన బ్రెడ్తో కేకులు తయారుచేస్తున్నారు..!