ఏసీబీ అదుపులో తొర్రూరు సీఐ

  • లారీని విడిచిపెట్టేందుకు రూ. 4 లక్షలు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • రూ. 2 లక్షలు ఇచ్చినా.. మిగతా డబ్బుల కోసం ఒత్తిడి

మహబూబాబాద్, వెలుగు : అక్రమంగా రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్న లారీలను విడిచి పెట్టేందుకు లంచం డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన తొర్రూరు సీఐ జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏసీబీ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం...కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి ఇటీవల లారీలో రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యం తరలిస్తుండగా దంతాలపల్లి పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు.

ఆ లారీని విడిచిపెట్టేందుకు తొర్రూరు సీఐ కర్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. 4 లక్షలు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. దీంతో కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గతంలోనే రూ. 2 లక్షలు చెల్లించాడు. మిగిలిన రూ. 2 లక్షలు ఇవ్వాలని సీఐ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుండడంతో కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గత నెల 25న ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేసిన ఏసీబీ ఆఫీసర్లు సోమవారం తొర్రూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడి చేసి సీఐ జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు. సీఐని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ సీఐలు ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.రాజు, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.రాజు, సిబ్బంది పాల్గొన్నారు.