AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి

మీ AC మునుపటిలా చల్లదనం ఇవ్వడం లేదా.. ఎన్ని విధాలా ప్రయత్నించినా ఫలితం లేదా.. అయితే ఖచ్చితంగా ఫిల్టర్ క్లీనింగ్ అవసరం. మీ ఏసీ ఫిల్టర్ దుమ్ము, ధూళిని పట్టుకొని ఫిల్టర్ ను బ్లాక్ చేస్తుంది. నిరంతరం మీకు చల్లటి గాలిని సరఫరా చేయాలంటే ఏసీ ఫిల్టర్ ను క్రమం తప్పకుండా క్లీన్ చేయాలి. అది విండో ఏసీ ఉపయోగిస్తున్నా దాని ఫిల్టర్ మంచి చల్లదనాన్ని ఇవ్వాల న్నా.. మీ ఏసీ లైఫ్ ను పెంచాలన్నా క్లీనింగ్ తప్పనిసరి. కొంతమంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దీంతో ఏసీ ఫిల్టర్ పాడై పోతాయి. అయితే ఏసీ ఫిల్టర్ ను శుభ్రం చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫిల్టర్ సురక్షితంగా పనిచేస్తూ ఎక్కువ చల్లదనాన్ని ఇస్తుంది.. ఆ జాగ్రత్తలేంటో చూద్దాం. 

హార్డ్ బ్రష్ చేయొద్దు

ఏసీ ఫిల్టర్ సాధారణంగా ఫైన్ థ్రెడ్ లు  లేదా లైట్ మెష్ తో తయారు చేయబడుతుంది. ఇది సున్నితమైనది కాబట్టి దానిని శుభ్రం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేెకపోతే అది దెబ్బతినే అవకాశం ఉంది. హార్డ్ బ్రస్ ఉపయోగించడం వల్ల ఫిల్టర్ దెబ్బతింటుంది. బ్రష్ ను ఉపయోగించకుండా గుడ్డ బ్రస్ ని ఉపయోగిస్తే మీ ఏసీ ఫిల్టర్ సేఫ్ గా ఉంటుంది. ఎక్కువ చల్లదనాన్ని ఇస్తుంది. 

ఫిల్టర్ శుభ్రం చేసేటప్పుడు మందపాటి దారాలు ఉన్న కఠినమైన అల్లికలున్న బట్టలను వినియోగించకూడదు. బట్టలోని దారాలు ఫిల్టర్ చేరి ఫిల్టర్ కు హాని కలిగించవచ్చు. ఇది గాలిని అడ్డుకుని ఏసీ కూలింగ్ సిస్టమ్ ను తగ్గించే అవకాశం ఉంది. సున్నితమైన క్లీనింగ్ కోసం మెత్తటి బట్టను వినియోగించాలి. 

వాషింగ్ డిటర్జెంట్ పౌడర్ వినియోగించవద్దు

ఇంట్లో ఉంది కదా అని ఏసీ ఫిల్టర్ ను శుభ్రం చేసేందుకు  డిటర్జెంట్ పౌడర్ ని వినియోగించడం మంచిది కాదు. ఇది ఫిల్టర్ ను శుభ్రపరచడం కంటే ఎక్కువ హాని కలిగిస్తుంది. డిటర్జెంట్ లోని కెమికల్స్ ఫిల్టర్ లోని వడపోత పదార్ధాన్ని దెబ్బతీస్తాయి. ఫిల్టర్ కు ఎలాంటి హాని లేకుండా శుభ్రం చేయాలంటే సాధారణ నీటిని మాత్రమే ఉపయోగించాలి. 

ఏసీ ఫిల్టర్ ను శుభ్రం చేసేటప్పుడు దుమ్ము ధూళిని బయటకు తీసేందుకు గట్టిగా ప్రెస్ చేస్తూ శుభ్రం చేయకూడదు. ఇధి ఫిల్టర్ లోని వడపోత పదార్ధాన్ని చిరికిపోయేలా చేస్తుంది. ఫలితంగా ఏసీ ఫిల్టర్ సరైన తీరులో పనిచేయదు. 
సో.. ఏసీ శుభ్రం చేసేటప్పుడు కొంచెం శ్రద్ధ పెట్టి సరైన పద్దతులను పాటిస్తే.. ఏసీ లైఫ్ పెరుగుతుంది.. ఎక్కువ చల్లదనాన్ని ఇస్తుంది.