జగిత్యాలలో ABVP  ర్యాలీ..  మెడికల్​ విద్యార్థిని మౌమితకు న్యాయం చేయాలని డిమాండ్​

కలకత్తా ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో ... మెడికల్​ విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యానికి నిరసగా జగిత్యాలలో ABVP విద్యార్థి సంఘం నాయకులు  నిరసన ర్యాలీ చేశారు.   ట్రైనీ జూనియర్ డాక్టర్ మౌమిత పై జరిగిన అత్యాచారానికి బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్​ చేశారు.  జగిత్యాల పాత బస్టాండ్​ చౌరస్తాలో ప్ల కార్డులతో నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు.  మెడికల్​ విద్యార్థిని మౌమితకు న్యాయం చేయాలని డిమాండ్​  చేశారు.  .

TMC ప్రభుత్వాన్ని  రద్దు చేయాలి...

ట్రైనీ జూనియర్​ డాక్టర్​ పై అత్యాచారం జరిగి పది రోజులైన పశ్చిమ బెంగాల్​ స్పందించకపోవడం బాధకరమన్నారు.  దోషులకు కాపాడేందుకు సాక్షాలను కప్పిపుచ్చుతున్న టీఎంసీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు.   బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీకి  రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే  వెంటనే వారి పదవికి రాజీనామా చేయాలనీ ఏబీవీపీ నేతలు  డిమాండ్ చేశారు... హత్యాచారానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఏ పార్టీకి చెందిన వారైనా  దోషులను బహిరంగంగా ఉరితీయాలి...  హత్యాచారానికి పూర్తి బాధ్యత  ప్రభుత్వం వహిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.