భద్రాచలం దేవస్థానంలో రామపాదుకలకు అభిషేకం

భద్రాచలం, వెలుగు: భద్రాచలం దేవస్థానంలో శనివారం భద్రుని మండపంలో రామపాదుకలకు అభిషేకం నిర్వహించారు. గోదావరి నుంచి తీర్థ బిందెను తెచ్చి సుప్రభాత సేవ చేశారు. అనంతరం రామపాదుకలకు పంచామృతాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం నిర్వహించారు. సీతారామచంద్రస్వామి మూలవరులకు సువర్ణ తులసీదళాలతో అర్చన జరిపారు.

బేడా మండపంలో సీతారాముల నిత్య కల్యాణం కనులవిందుగా జరిగింది. ఖమ్మం జిల్లా మాజీ కలెక్టర్, హౌసింగ్​ ఎండీ వీపీ గౌతమ్​ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు అర్చకులు లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు.