కాలినడకన హజ్​యాత్ర.. 10 నెలల పాటు 5 వేల కిలోమీటర్ల జర్నీ

గోదావరిఖని, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన ఎండీ అబ్దుల్​అబీద్​హజ్​యాత్రకు నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 12న ఇంటి నుంచి బయలుదేరిన అబీద్​ఆదివారం గోదావరిఖనికి చేరుకున్నాడు. ఆయనకు స్థానిక జామా మజీద్​ మత పెద్దలు ఫసీయోద్దీన్, సర్వర్​ హుస్సేన్, ఎండీ ఖాజామియా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. రోజుకు 20 నుంచి 25 కిలోమీటర్ల వరకు కాలినడకన వెళ్తానని, దగ్గరలో ఉండే మజీద్​లో విశ్రాంతి తీసుకుంటున్నానని అబీద్​ తెలిపారు. ఆసిఫాబాద్​ జిల్లా బార్డర్​ నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్​ అయి గుజరాత్, పంజాబ్​ మీదుగా పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలోని హజ్​కు 10 నెలల పాటు 5 వేల కిలోమీటర్లు  ప్రయాణించి చేరుకుంటానని చెప్పాడు.