నిజామాబాద్ జిల్లాలో స్పీడ్​గా ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు

  • హాస్పిటల్​లో రోగి చేరిన వెంటనే అప్రూవల్​
  • జనవరి నుంచి జీజీహెచ్​లో 3,901 మందికి సర్జరీలు
  • రూ.5 కోట్ల విలువ ఆపరేషన్​లు
  •  బీఆర్​ఎస్​ గవర్నమెంట్​హయాంలో బిల్స్​ పెండింగ్​ 
  • ఇప్పుడు సీన్​ మారడంతో ప్రైవేట్​ హాస్పిటల్స్​లో పెరిగిన హుషారు   

నిజామాబాద్​, వెలుగు :  జిల్లాలో  ఆరోగ్యశ్రీ ఆపరేషన్​లలో వేగం పెరిగింది.  గత బీఆర్​ఎస్​ గవర్నమెంట్​ హయాంలో పేరుకుపోయిన బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం  క్లియర్​ చేయడంతో  ప్రైవేట్​ హాస్పిటల్స్​ మేనేజ్​మెంట్లు ఆరోగ్యశ్రీలో లిస్టెడ్​ హాస్పిటల్​గా  చేరేందుకు పోటీ పడుతున్నాయి.  ఆరోగ్యశ్రీ హెల్త్​ స్కీం పరిధిని విస్తరించడం ట్రీట్​మెంట్ ​రేట్లను 11 ఏండ్ల తర్వాత పెంచడం కూడా దీనికి కారణంగా కనిపిస్తోంది. 

జీజీహెచ్​లో విపరీత రద్దీ

మెడికల్​ కాలేజీకి అనుబంధంగా పనిచేసే జీజీహెచ్​ హాస్పిటల్​లో రాజీవ్​ ఆరోగ్యశ్రీ  ​ఆపరేషన్లు​ పెరిగాయి. జనవరి నుంచి జులై  వరకు 3,901 ఆపరేషన్లు చేయగా రూ.5 కోట్ల వరకు బిల్లులను ప్రభుత్వం చెల్లించింది. ప్రతి రోజు దాదాపు 20కి పైగా శస్త్రచికిత్సలు ఆరోగ్య శ్రీ కింద చేస్తున్నారు. మోకీలు మార్పిడికి ఆదిలాబాద్​, కరీంనగర్​ నుంచి కూడా రోగులు వస్తున్నారు. స్పైన్​, న్యూరో, బ్రెయిన్​ సర్జరీలు జరుగుతుండటంతో రోగులు కూడా ఎక్కువగా ఈ ఆసుపత్రికి వస్తున్నారు. ఆరోగ్యశ్రీ ట్రీట్​మెంట్​ విధానం  సరళీకృతం కావడంతో  రోగుల్లో  నమక్మం ఏర్పడింది. గవర్నమెంట్​ హాస్పిటల్​లో చేరిన 24 గంటల్లో  ట్రీట్​మెంట్​ స్టార్ట్​ అయ్యేలా చూస్తున్నారు.  ప్రైవేట్​ లిస్టెడ్​ హాస్పిటల్స్​లో జాయిన్​ అయ్యే బాధితులకు ఒక రోజు గడువులో అప్రూవల్​ శాంక్షన్​ చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో పేదలకు ప్రయోజనం కలుగుతోంది. ఆరోగ్యశ్రీ స్కీం పరిధిని గవర్నమెంట్​ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు ట్రీట్​మెంట్​ రేట్లను కూడా పెంచింది. కొత్తగా 163 చికిత్సలను స్కీంలో చేర్చి మొత్తం 1,835 రకాల ట్రీట్​మెంట్ల​తో పరిధిని విస్తరించింది. కొత్తగా చేరిన దాంట్లో  మోకీలు మార్పిడి కూడా ఉన్నందున  జీజీహెచ్​లో ప్రతినెలా 15 వరకు ఆపరేషన్​లు జరుగుతున్నాయి.

బిల్స్​పై నమ్మకం

గత బీఆర్​ఎస్​ గవర్నమెంట్​ ఆరోగ్యశ్రీ లో జరిగిన ఆపరేషన్లకు సకాలంలో బిల్స్​ చెల్లించకపోవడంతో గవర్నమెంట్​, ప్రైవేట్​ లిస్టెడ్​ హాస్పిటల్స్​లో బకాయిలు పేరుకుపోయాయి. కాంగ్రెస్​ సర్కారు కొలువుదీరాక జీజీహెచ్​ హాస్పిటల్​ పాత బాకీ రూ.4  కోట్లు చెల్లించింది. జిల్లాలోని 14 ప్రైవేట్​ హాస్పిటల్స్​కు పాత బకాలయిన్నింటీని తీర్చేసింది. కొత్త బిల్లులు పెట్టిన వెంటనే శాంక్షన్​ అవుతున్నాయి. దీంతో  పేదలకు సకాలంలో వైద్యం అందుతోంది. పరిస్థితులు మారినందున గడిచిన నాలుగు నెలల్లో కొత్తగా నాలుగు ప్రైవేట్​ హాస్పిటల్స్​ ఆరోగ్యశ్రీ సేవల పర్మిషన్స్​ పొందాయి.

ఉత్సాహంగా పనిచేయగలుతున్నం

రాజీవ్​ ఆరోగ్యశ్రీ  బిల్స్​ పాతవన్నీ క్లియరయ్యాయి. గత ఏడాది రూ.4 కోట్ల బిల్లు ఆగిపోవడంతో స్కీం పరిధిలో పనిచేయడం కష్టమైంది. ఇప్పుడు లోపాలు సెట్​ అయ్యాయి. అధిక సంఖ్యలో ఆపరేషన్​లు చేయగలుతున్నం. 

- డాక్టర్ ప్రతిమారాజ్​, జీజీహెచ్​ సూపరెండెంట్