హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆమ్​ఆద్మీ పార్టీ డకౌట్

న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) డకౌట్ అయింది. మొత్తం 90 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ సొంత రాష్ట్రం హర్యానానే. ఈసారి ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగగా.. తాను ‘హర్యానా కా లాల్ (హర్యానా కొడుకును)’ అంటూ కేజ్రీవాల్ ప్రచారం చేశారు. 

కానీ పార్టీ గెలుపు కోసం ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చాలాచోట్ల ఆప్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. పార్టీలోని ప్రముఖులు కూడా ఓటమి పాలయ్యారు. వచ్చిన ఓట్లు కేవలం 1.76 శాతమే.