గోవిందరాజుస్వామికి ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌​ పూజలు 

చందుర్తి, వెలుగు: చందుర్తి మండలం సనుగుల గ్రామ శివారులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజుల స్వామిని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో గడపాలని దేవుడిని కోరుకున్నట్లు విప్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. తిరుగు ప్రయాణంలో రామారావు పల్లె బీరప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆయన వెంట జడ్పీటీసీ నాగం కుమార్, లీడర్లు ముకుంద రెడ్డి, మేకల గణేశ్‌‌‌‌‌‌‌‌, నాగిరెడ్డి, అజయ్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. 

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం

కోనరావుపేట, వెలుగు: కోనరావుపేట మండలం మర్తనపేటలో గురువారం కరెంట్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌తో చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. శుక్రవారం మర్తనపేటలోని రైతు ముండ్రాయి సందీప్ డెడ్‌‌‌‌‌‌‌‌బాడీకి నివాళులర్పించారు. అలాగే బీఆర్ఎస్ లీడర్లు చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఏనుగు మనోహర్ రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.