Aadhaar Card: ఆధార్ కార్డు ఆప్డేట్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు

ఆధార్ కార్డు..ఇప్పుడు ఈ కార్డు లేకుండా ఏ పని జరగదు..ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు చాలా కీలకం. ప్రభుత్వ, ప్రవేట్ రంగం ఏదైనా ఆధార్ కార్డు నంబరు తప్పని సరి. అయితే ఆధార్ కార్డులో ఏవైనా తప్పులుంటే.. లేదా అడ్రస్ మార్పు, పుట్టిన తేది మార్పు చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని అవకాశాలు కల్పిస్తోంది యూనిక్ ఐడెంటి ఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI). వీటిలో ఏది ఎన్నిసార్లు మార్చుకోవచ్చో.. కార్డులో ఒకటి లేదా రెండు సార్లు మార్చగలిగే కొన్ని అంశాలను UIDAI  వివరిం చింది. 

పేరు మార్పు 

ఆధార్ కార్డులో పేరు సవరణకు UIDAI అవకాశం విషయం తెలిసిందే.. అయితే ఆధార్ కార్డుని ఉపయోగిస్తున్నప్పుడు జీవిత కాలంలో మీ పేరును రెండు సార్లు సవరించుకోవచ్చు. ఇది తప్పులను సరిదిద్దడం, వివాహం తర్వాత ఇంటిపేరును జోడించడం రెండింటికే వర్తిస్తుంది. 

లింగమార్పు 

ఆధార్ కార్డులో లింగమార్పులను ఒకసారి మాత్రమే చేయడానికి అవకాశం ఉంది. పురుషుడు, స్త్రీ మీ  లింగాన్ని అప్డేట్ చేస్తున్నపు పొరపాట్లు చేస్తే చాలా రిస్క్ తో కూడిన పని. 

అడ్రస్ మార్పు

ఆధార్ కార్డులో పేరు, లింగం అప్డేట్ కు ఉన్నట్లు లిమిటేషన్ అడ్రస్ మార్పుకు లేదు. అడ్రస్ ను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. ఎందుకంటే తరుచుగా ఇంటిని మా ర్చే అవకాశం ఉంటుంది కాబట్టి. వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, హౌజ్ రెంట్ అగ్రిమెంట్ వంటి అడ్రస్ ఫ్రూఫ్ డాక్యుమెంట్లను సమర్పించి మీ అడ్రస్ను అప్డేట్ చేసు కోవచ్చు. 

సున్నితమైన సమాచారం అప్డేట్ చేసేటప్పుడు..

మీరు మీ ఆధార్ కార్డులో సున్నితమైన సమాచారాన్ని అప్డేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరు, లింగం, పుట్టిన తేదీ వంటి కీలకమైన సమాచారం  అప్డేట్ చేసేటప్పుడు పొరపాట్లు దొర్లితే చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది.. అప్డేట్ కు ముందుకు ఒకటికిరెండు సార్లు చెక్ చేసుకోవాలి. 

ALSO READ | BSNL యూజర్లకు గుడ్ న్యూస్.. పైసా ఖర్చులేకుండా 500కి పైగా లైవ్ ఛానెల్స్, పేటీవీ ఆప్షన్లు