మొహర్రం వేళ డ్యాన్స్​ చేస్తూ యువకుడి మృతి..

మల్యాల, వెలుగు: మొహర్రం సందర్భంగా డ్యాన్స్‌ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. జగిత్యాల జిల్లా మల్యాలలోని బీసీ కాలనీకి చెందిన బెక్కం లక్ష్మణ్‌ అలియాస్ చింటూ (24) మొహర్రం సందర్బంగా ఫ్రెండ్స్​తో కలిసి పులి వేషం వేశాడు. పీరీల ముందు డ్యాన్స్‌ చేస్తుండగా అలిసిపోయి అస్వస్థతకు గురయ్యాడు. ఇంటికి చేరుకున్న లక్ష్మణ్‌ నీళ్లు తాగి కూర్చోగా ఛాతిలో నొప్పి వస్తోందని కుటుంబసభ్యులకు చెప్పాడు. వారు 108లో వాహనంలో జగిత్యాల హాస్పిటల్‌కు తరలిస్తుండగా చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.