జాబ్ ఇష్టం లేక యువకుడి ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

  • కన్నతల్లే చంపించిందని గ్రామస్తుల ఆందోళన 

మెట్ పల్లి, వెలుగు: హోటల్ మేనేజ్మెంట్ కోర్సు వద్దు ఏదైనా జాబ్ చేసుకోమని తల్లిదండ్రులు మందలించడంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు మంగళవారం చనిపోయాడు. ఎస్సై చిరంజీవి వివరాల ప్రకారం.. మెట్ పల్లి మండలం జగ్గాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఏనుగు ప్రభాస్(19) డిగ్రీ పూర్తి చేశాడు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తానని చెప్పడంతో ఏదైనా జాబ్ చేసి స్థిరపడాలని తల్లిదండ్రులు సూచించారు.

జాబ్​చేయడం ఇష్టం లేని అతను ఈ నెల 8 న ఇంట్లో గడ్డి మందు తాగాడు. చికిత్సి కోసం మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లికి, అక్కడి నుంచి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. చికిత్స పొందుతూ 16 రోజుల తర్వాత చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ తెలిపారు.

కాగా యువకుడి మృతికి అతని తల్లే కారణమని రెండు రోజుల కింద తండ్రి ఫిర్యాదు చేయడం గమనార్హం. తల్లికి అదే గ్రామానికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, విషయం కొడుకుకు తెలియడంతో ఆమె ప్రియుడితో కలిసి అతనికి పాయిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రభాస్ మృతితో కోపోద్రోక్తులైన గ్రామస్తులు కన్నకొడుకును ప్రియుడితో కలిసి చంపిందని ఆరోపిస్తూ మృతుని తల్లిపై దాడికి దిగారు.

దీంతో జగ్గసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉద్రిక్తత నెలకొంది. తల్లిపై చర్యలు తీసుకునేదాకా అంత్యక్రియలు చేసేది లేదని ప్రభాస్ డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీతో నిరసన చేపట్టారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మేజిస్ట్రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మృతుని వాంగ్మూలం తీసుకున్నారని, దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు గ్రామస్తులను  సముదాయించారు.