ఈ గుడిలో పెళ్లికి ముహూర్తం అవసరం లేదు.. ఎప్పుడైనా.. ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు..

కేరళ త్రిసూర్ జిల్లాలోని పవిత్ర విష్ణు క్షేత్రం గురువాయూరు.  దక్షిణ ద్వారకగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో శ్రీ కృష్ణుడు గురువాయూరప్పన్  అనే పేరుతో భక్తులతో పూజలను అందుకుంటున్నారు.ఈ దేవాలయం వివాహాలు చేసుకునేందుకు ప్రసిద్ది చెందింది.  ఇక్కడ జరిగే పెళ్లిళ్లలకు ముహూర్తాలు అవసరం లేదట.  దేవాలయం తీసి ఉన్నప్పుడు ఏ సమయంలోనైనా పెళ్లిళ్లు చేసుకోవచ్చట.  తెల్లవారు జామున 3 గంటల నుంచి బాజా భజంత్రీలు మోగుతుంటాయి. 

గురువాయూర్​ దేవాలయాన్ని భూలోక వైకుంఠం అని పిలుస్తారు.  ఇక్కడ పెళ్లి చేసుకుంటే వైకుంఠంలోనే వివాహం అయిందని ప్రజలు విశ్వసిస్తుంటారు.  అలాగే ఈ దంపతులకు శ్రీకృష్ణుని కటాక్షం లభించి.. వీరి వైవాహిక జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుందని భావిస్తుంటారు.  అయితే వివాహం అయిన తరువాత కొత్త జంటను ఈ దేవాలయం లోపలికి వెళ్లనివ్వరు.  అందుకే పెళ్లికి ముందే ... కొత్తగా దంపతులయ్యేవారు  ఆలయం లోపల స్వామిని దర్శించుకుంటారు. 

ఈ దేవాలయంలో స్వామిని ప్రార్ధిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి.  గురువాయూర్​ దేవాలయంలోని విగ్రహాన్ని ద్వారకలో దేవకీ వసుదేవులు పూజించారని పురాణాల ద్వారా తెలుస్తోంది.  దీనిని దేవతల గురువు బృహస్పతి.. ఆయన శిష్యుడు వాయుదేవుడు స్థాపించారు. కొంతమంది దంపతులకు  ఈ దేవాలయాన్ని ప్రతి సంవత్సరం దర్శించుకునే ఆనవాయితీ ఉంది.  మరికొంతమంది ప్రతి నెలా దర్శించుకుంటారు,