అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. 10 రోజుల  పర్యటన కోసం అమెరికా వెళ్లారు సీఎం. అక్కడ  తెలుగువారు బోకేలతో రేవంత్ కు గ్రాండ్ గా వెల్కం చెప్పారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ టూర్ కొనసాగుతుందని తెలంగాణ CMO ట్వీట్ చేసింది. టూర్లో భాగంగా అమెరికా, సౌత్ కొరియాలోని టాప్ కంపెనీలతో భేటీ కానున్నారు ముఖ్యమంత్రి.

సీఎం అమెరికా, సౌత్​ కొరి యా టూర్​లో భాగంగా రాష్ట్రానికి రూ.16 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు  ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఐటీ, హెల్త్​కేర్, లైఫ్​సైన్సెస్, ఫుడ్​ప్రాసెసింగ్ తదితర రంగాల్లో భారీ ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆ పెట్టుబడులు రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి తోడ్పడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.