లింగంపేట మండలం టెన్త్ టాపర్లకు సన్మానం

లింగంపేట, వెలుగు : లింగంపేట మండలం కొర్పోల్​ గ్రామానికి చెందిన పలువురు టెన్త్ స్టూడెంట్లను ఆదివారం ప్రేరణ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సత్కరించారు. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన కర్రోళ్ల చిత్రలేఖ (9.2) పర్శం రాకేశ్(9.2) అనే  స్టూడెంట్లకు శాలువాలు కప్పి  సత్కరించారు.  ఈ సందర్భంగా ప్రేరణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్​ సొసైటీ జనరల్​ సెక్రటరీ సారిక మాట్లాడుతూ..

కేవలం విద్య వల్లనే మనుషుల జీవితాలు వృద్ధి చెందుతాయన్నారు.  ఉత్తమ ప్రతిభ కనబర్చిన స్టూడెంట్లు ఉన్నత చదువులు చదివి సమాజానికి  సేవ చేయాలని సూచించారు.  కార్యక్రమంలో  ప్రేరణ ఎడ్యుకేషన్ అండ్​ వెల్పేర్​ సొసైటీ సభ్యులు లక్ష్మీనారాయణ, రాములు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.