పెద్దాపూర్ గురుకులంలో విద్యార్థికి అస్వస్థత..పాము కాటు వల్లేనని అనుమానాలు

  •     పాము కాటు వల్లేనని కుటుంబసభ్యుల అనుమానాలు

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో ఓ విద్యార్థి బుధవారం అస్వస్థతకు గురయ్యాడు. మెట్‌‌‌‌‌‌‌‌పల్లి శివాజీనగర్ కు చెందిన ఓంకార్ అఖిల్(13) పెద్దాపూర్ గురుకులంలో 8వ తరగతి చదువుతున్నాడు. రోజూలాగే అఖిల్ ఉదయం 6 గంటల ప్రాంతంలో నిద్రలేచాడు. నిద్ర లేచినప్పటి నుంచి చెయ్యి నొప్పిగా ఉందని టీచర్ల చెప్పగా వారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. 

హాస్టల్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న పేరెంట్స్‌‌‌‌‌‌‌‌, ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌తో కలిసి అఖిల్‌‌‌‌‌‌‌‌ను కోరుట్లలోని ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ముందస్తుగా యాంటీ వీనమ్ ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స చేశారు. 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉండాలని డాక్టర్లు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మెట్‌‌‌‌‌‌‌‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో ప్రమోద్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి ఆరా తీశారు.  

డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో మాట్లాడుతూ అఖిల్‌‌‌‌‌‌‌‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కాగా విద్యార్థి అఖిల్ ఉదయం 6 గంటలకు అస్వస్థతకు గురైతే 12 గంటల వరకు ఎందుకు హాస్పిటల్ కు తీసుకెళ్లకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  కాగా బుధవారం రాత్రి వైద్యాధికారులు శ్రీనివాస్​, అంజిత్​రెడ్డి గురుకుల స్కూల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి అఖిల్​ అస్వస్థతకు గల కారణాలను విద్యార్థులను ఆరా తీశారు.