ఐఫోన్‌లో యాప్‌ను ఓపెన్ చేసినప్పుడు రామ్ లోడ్ అవుతుంది. దాని ద్వారా ఫోన్ డాటా యాక్సెస్ ఈజీ అవుతుంది. అయితే, ఒకేసారి చాలా యాప్‌లు ఓపెన్ చేసి ఉంటే.. ఐఫోన్‌లో రామ్ బాగా స్లో అవుతుంది. అలాంటప్పుడు ఐఫోన్‌లో రామ్‌ను డైరెక్ట్‌గా క్లియర్ చేయలేం. కానీ, కొంత మెమరీని ఖాళీ చేయడానికి సాఫ్ట్ రీసెట్ లేదా మాన్యువల్ రీస్టార్ట్ చేయొచ్చు. సాఫ్ట్ రీసెట్ అంటే అప్పుడు ఓపెన్ చేసి ఉన్న యాప్‌లన్నీ క్లోజ్ అవుతాయి. మాన్యువల్ రీస్టార్ట్ ఆప్షన్ ద్వారా ఒకసారి ఐఫోన్ ఆపేసి మళ్లీ ఆన్ చేయాలి.
సాఫ్ట్ రీసెట్ చేయాలంటే.. మొదట సైడ్ బటన్, వాల్యూమ్ బటన్‌ను నొక్కి పట్టుకోవాలి. స్లయిడ్ టు పవర్ ఆఫ్ స్లయిడర్ అని కనపడగానే బటన్స్ రిలీజ్ చేయాలి. ఐఫోన్ రీస్టార్ట్ అయ్యే వరకు సైడ్ బటన్స్ మళ్లీ నొక్కి పట్టాలి.
మాన్యువల్ రీస్టార్ట్
సెట్టింగ్స్‌లో జనరల్ ఆప్షన్ సెలక్ట్ చేయాలి. తర్వాత కిందికి స్క్రోల్ చేసి, షట్‌డౌన్ మీద ట్యాప్ చేయాలి. ఐఫోన్ పూర్తిగా ఆగిపోయే వరకు పవర్ ఆఫ్ స్లయిడర్‌ని డ్రాగ్ చేసి పట్టుకోవాలి. ఆ తర్వాత యాపిల్ లోగో కనిపించే వరకు సైడ్ బటన్స్ నొక్కి పట్టుకోవాలి. ఐఫోన్ రామ్‌ను క్లియర్ చేయాలి. కొన్నిసార్లు యాప్ క్రాష్ కావడం లేదా ఐఫోన్ స్లో కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎలాంటి సమస్యలు లేకుంటే రామ్ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఐఫోన్ రామ్ ఆటోమేటిక్‌గా మేనేజ్ చేస్తుంది. మాన్యువల్‌గా చేయాల్సిన అవసరం ఉండదు. అయినా కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటే పైన చెప్పినట్టు చేస్తే కొంత మెమరీని ఖాళీ చేయొచ్చు. దానిద్వారా డివైజ్ పర్ఫార్మెన్స్ మెరుగవుతుంది.