కొండగట్టు అంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే శాలువా

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువాను శనివారం బహూకరించారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయకుమార్ కుటుంబ సమేతంగా అంజన్నను దర్శించుకుని మగ్గంపై నేసిన పట్టు శాలువాను స్వామివారికి సమర్పించాడు. ఆలయ అర్చకులు విజయ్ కుమార్ కుటుంబానికి ఆశీర్వచనం ఇచ్చారు.