వరినాట్లు వేస్తుండగా రైతు మృతి

కామారెడ్డి జిల్లా : వరినాటు వేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో చోటుచేసుకుంది.  లో వరి నాటు వేస్తుండగా అన్నా సాగర్ గ్రామానికి చెందిన రవి(32) అనే రైతు నారు మోస్తున్నాడు. విద్యుత్ స్తంభాలకు ఉన్న తీగలు తలపై పెట్టుకున్న వరి నారుకు తగలడంతో విద్యుత్ షాక్ కు గురైయ్యాడు.

దీంతో రైతు రవి అక్కడికక్కడే చనిపోయాడు. రైతు రవి మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన చేపట్టారు. లైన్ మెన్ కాశిరామ్, ఏఈ సత్యనారాయణ గౌడ్ లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తు్న్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.