కెల్విన్ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్

కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్‌‌‌‌లోని కెల్విన్ హాస్పిటల్ లో అరుదైన క్యాన్సర్, ప్లాస్టిక్ సర్జరీ  ఆపరేషన్ నిర్వహించినట్లు  డాక్టర్ అశోక్ రెడ్డి మంగళవారం తెలిపారు. జగిత్యాల జిల్లా  కేంద్రానికి చెందిన పేషెంట్ గంగవ్వ తన తొడభాగంలో నరాలకు సంబంధించిన గడ్డతో బాధ పడుతూ ఈనెల 11న హాస్పిటల్ లో జాయిన్ అయిందన్నారు. 

స్కానింగ్ చేయగా ఆ గడ్డ.. తొడభాగం నుంచి  నరాల ద్వారా తొంటిఎముక నుంచి కడుపులోనికి చొచ్చుకు పోతున్నట్టు  డాక్టర్లు  గుర్తించారన్నారు. క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డా. చింతసురేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఈనెల  17న సర్జరీని   విజయవంతంగా పూర్తి చేశామన్నారు.  పేషెంట్ రికవరీ అయి 27న  డిశ్చార్జి అయినట్లు చెప్పారు.  ఇలాంటి కేసులు  ప్రపంచ వ్యాప్తంగా 10లోపు నమోదైనట్లు ఆయన  తెలిపారు. ఆయనతోపాటు డాక్టర్  దొంతుల ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.